- స్వామీ వివేకానంద
- మాయా ప్రపంచము
- Creation
- Games
- optical-illusions
- Education
- Jokes
- Quotations
- Motivational Quotations
- Space
- Cars_Bikes
- పొడుపు కథలు
- సామెతలు
- జనరల్ నాలెడ్జ్
- వేమన పద్యాలు
- సుమతీ శతకము - బద్దెన
- కృష్ణ శతకము - నృసింహకవి
- చాటు పద్యములు
- దాశరధీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)
- నరసింహ శతకము - శేషప్పకవి
- నారాయణ శతకము - బమ్మెర పోతన
- భాస్కర శతకము - మారవి వెంకయ్య
- శ్రీకాళహస్తి శతకము
- శ్రీకాళహస్తీశ్వర శతకము - ధూర్జటి
సామెతలు
*అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు.
*అంచు డాబే గానీ, పంచె డాబు గాదు.
*అంధునకు అద్దము చూపినట్లు.
*అంకె లేని కోతి లంకంతా చెరచిందట.
*అంగట్లో అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని వుంది !
*అంగట్లో అరువు - తలమీద బరువు లాంటిది
*అంగడిలో దొరకనిది - అమ్మ ఒక్కటే !
*అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకున్ఠం.
*అగ్నికి వాయువు తొడైనట్లు.
*అంచులేని గిన్నె - అదుపులేని పెళ్ళాం !
*అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత!
*అంతా మన మంచికే
*అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు !
*అంత్య నిష్టూరంకన్నా - ఆది నిష్టూరం మేలు !
*అందని ద్రాక్షపండ్లు - పుల్లన!
*అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.
*అందితే జుట్టు అందక పోతే కాళ్ళు.
*అందరూ ఎక్కేవాళ్ళయితే మోసేవాళ్ళెవరు!
*అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
*అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
*అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.
*అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు.
*అప్పు చేసి పప్పు కూడు.
*అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి.
*అయ్యవచ్చే వరకు అమావాస్య ఆగుతుందా.
*అయ్యవారిని చెయ్యబోతే కోతి బొమ్మ అయినట్లు.
*అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
*అతి రహస్యం బట్టబయలు
*అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
*అనువు గాని చోట అధికులమనరాదు
*అభ్యాసం కూసు విద్య
*అజ్ఞానం అభివృద్ధికి అడ్డుగోడ
*అభ్యాసం ప్రారంభిస్తే అజ్ఞానం తెలుస్తుంది
*అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది
*అదిగో పులి ఇదిగో తోక
*అమ్మ పుట్టిల్లు మేనమామకెరుకే
*అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి
*అత్యున్నతమైన ఆదర్శాన్ని ఎన్నుకుని దానికి తగ్గట్లుగా జీవించండి
*అడకత్తెరలో పోకచెక్క
*అహంకారం అజ్ఞానానికి అనుంగు బిడ్డ
*అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత పెరుగుతుంది
*అతి సర్వత్ర వర్జయేత్
*అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు! అన్నీ నీపైనె ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు!!
*అందరి సంతోషం లో నీ సంతొషాన్ని వెతుక్కో
*అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలా?
*అజ్ఞానులు గతాన్ని, బుద్ధిమంతులు వర్తమానాన్ని, మూర్ఘులు భవిష్యత్తును మాట్లాడతారు
*అణకువ లేని అందం అసహ్యంగా ఉంటుంది
*అత్యున్నతమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్లుగా జీవించండి
*అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి
*అందరి పట్ల విధేయత కనబరచండి కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి
*అయితే ఆదివారం కాకుంటే సోమవారం
*ఆకుకు అందదు, పోకకు పొందదు.
*ఆచారం ముందర, అనాచారం వెనుక.
*ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.
*ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
*ఆ తాను ముక్కే !!!.
*ఆ మొద్దు లోదే ఈ పేడు.
*ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.
*ఆ ఊరి దొర ఈ ఊరికి తలారి !
*ఆకలికి అదుపు, ఇంటికి పొదుపు ఉండాలి!
*ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు
*ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
*ఆకారం ఉంటే శ్రీకారం ఉండదు !
*ఆకాశానికి హద్దే లేదు.
*ఆటా పాటా మా ఇంట మాపటి భోజనం మీ ఇంట !
*ఆచరణ తక్కువ! ఆర్భాటం ఎక్కువ!
*ఆడది తల్లి అదుపున - మగవాడు తండ్రి అదుపున పెరగాలి.
*ఆడది తిరిగి చెడు ! మగవాడు తిరగక చెడు !
*ఆత్రానికి బుద్ధి మట్టు.
*ఆడబోయిన తీర్థము యెదురైనట్లు.
*ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
*ఆడది మేడిపండు లాంటిది.
*ఆడవారి మాటలకు అర్దాలే వేరులే.
*ఆడింది ఆట పాడింది పాట.
*ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.
*ఆదిలోనే హంస పాదు.
*ఆనందమే బ్రహ్మానందం.
*ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
*ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.
*ఆరాటమే గాని పోరాటం లేదు.
*ఆరే దీపానికి వెలుగు యెక్కువ.
*ఆరోగ్యమే మహాభాగ్యము.
*ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?.
*ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట.
*ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.
*ఆలోచించి మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఆలోచించకూడదు
*ఆర్నెల్లు కర్రసాము నేర్చి మూలనున్న ముసలవ్వపై ప్రతాపం చూపాట్ట...
*ఆలస్యం అమృతం విషం.
*ఆవలిస్తే పేగులు లెక్కపెడతారు
*ఆడితప్పరాదు పలికి బొంకరాదు
*ఆశకు అంతు లేదు; నిద్రకు సుఖం లేదు.
*ఇంట గెలిచి రచ్చ గెలువు.
*ఇంటి కన్నా గుడి పదిలం.
*ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది.
*ఇంటి గుట్టు లంకకు చేటు.
*ఇంటి గుట్టు, పెరుమాళ్ళ కెరుక.
*ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.
*ఇంటికి అవ్వ అవసరం కొలతకు తవ్వ అవరం.
*ఇంటికి దీపం ఇల్లాలు.
*ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి.
*ఇంటిలోని పోరు ఇంతింత కాదయ.
*ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు.
*ఇంటికన్న గుడి పదిలం.
*ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.
*ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుణ్ణి మొక్కినట్లు.
*ఇంట్లో పిల్లి వీధిలో పులి.
*ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్లు.
*ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.
*ఇల్లు పీకి పందిరేసినట్టు
*ఇచ్చేవాడు తీసుకునేవాడికి లోకువ.
*ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు.
*ఇనుము విరిగితే అతకవచ్చు, మనసు విరిగితే అతకలేము.
*ఇరుగు చల్లన పొరుగు చల్లన.
*ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ము బర్రె కొట్టానికి చేటు.
*ఇల్లలకగానే పండుగా?
*ఇల్లిరికం కన్నా మూలరికం మిన్న.
*ఇల్లు చూచి ఇల్లాలిని చూడు.
*ఇష్టం కానిదే కష్టం.
*ఇస్తే వరం పెడితే శాపం.
*ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
*ఈ సంబరానికేనా ఇంత ఊరింపు.
*ఈగూటి చిలుకకు ఆగూటిపలుకే వస్తుంది.
*ఈచేత చేసి ఆచేత అనుభవించినట్లు.
*ఈటె పోటు మానుతుంది కాని మాట పోటు మానదు.
*ఈడుచూసి పిల్లనివ్వాలి , పిడి చూసి కొడవలికొనాలి.
*ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్టు.
*ఈతకు మించిన లోతే లేదు.
*ఈతచెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు.
*ఈదగల వానికి లోతు లేదు.
*ఈనాడు ఇంట్లో రేపు మంట్లో.
*ఈనిన పిల్లికి ఇల్లు వాకిలీ తెలియనంత ఆకలి.
*ఈవేళ పని రేపటికి వాయిదా వేయకు.
*ఈశ్యానం పొయ్యి పెడితే అన్నం పుట్టదు.
*ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి.
*ఉండనిస్తే పండుతుంది, ఊడనిస్తే ఎండుతుంది.
*ఉండి చూడు ఊరు అందం, నానాటికి చూడు నా అందం.
*ఉట్టి కెగరలేనమ్మ స్వర్గాని కెగిరినట్లు.
*ఉడుముకు రెండు నాలుకలు.
*ఉత్తర చూచి ఎత్తర గంప.
*ఉదాయాన్నే వచ్చిన చట్టం ఉదాయాన్నే వచ్చిన వాన ఉండవు.
*ఉన్న ఊరు తల్లి వంటిది.
*ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ.
*ఉన్నమాట చెపితే, వూరు అచ్చిరాదు.
*ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టి లేనమ్మ లేనమ్మకే పెట్టినట్లు.
*ఉన్నవాడు వూరికి పెద్ద, చచ్చినవాడు కాటిక పెద్ద.
*ఉపాయం ఎరుగనివాణ్ణి వూళ్ళో వుండ నివ్వకూడదు.
*ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు.
*ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు.
*ఉప్పు లేని కూర పప్పు లేని అన్నం పనికిరాదు.
*ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం ఇద్దరికీ చేటు.
*ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు.
*ఉత్సాహం క్రియాశీలతను వెయ్యి రెట్లు పెంచుతుంది
*ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు.
*ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు.
*ఊర పిచుక మీద తాటి కాయ పడినట్లు.
*ఊరికి వచ్చినమ్మ నీరుకు రాదా?
*ఊరే చేరవద్దు రౌతా అంటే, గుర్రాన్ని ఎక్కడకట్టేది అన్నాడట.
*ఊసరవల్లి వలె రంగులు మార్చేవాడు.
*ఊహించ లేనిదే జీవితం.
*ఊరంతా వడ్లు ఎండబెట్టు కొంటె, నక్క తోక యెండబెట్టు కొన్నదంట.
*ఊరంతా చుట్టాలు ఉట్టికట్ట తావు లేదు.
*ఊరు మొహం గోడలు చెపుతాయి.
*ఊరకుండటం కంటే, ఊయలూగటమే మేలు.
*ఊరక రారు మహానుభావులు.
*ఊరుకోవడమంత ఉత్తమం, బోడి గుండంత సుఖం లేదు.
*ఋణశేషము, అగ్నిశేషము, వ్రణశేషము, శత్రుశేషం వుంచకూడదు.
*ఎంచబోతే మంచమంతా కంతలే.
*ఎద్దు పుండు కాకికి ముద్దా?
*ఎంత ప్రాప్తమో, అంత ఫలము.
*ఎక్కడకడితే నేమి మనమందలో ఈనితేసరి.
*ఎక్కడికెళుతున్నావు విధవమ్మా అంటే వెంట వస్తున్నాను పదవమ్మా అన్నదంట.
*ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది.
*ఎప్పటి మేలు అప్పటికే.
*ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే.
*ఎంత వెలుగుకు అంత చీకటి.
*ఎంత సంపదో అంత ఆపద ఎవరికివారు ఎమునా తీరు.
*ఎనుబోతు మీద వాన కురిసినట్టు
*ఎక్కువ వెల బెట్టి గుడ్డను, తక్కువ వెల బెట్టి గొడ్డును కొనరాదు.
*ఎవరికి వారే యమునా తీరే.
*ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
*ఎలుక ఎంత ఏడ్చినా, పిల్లి కనికరిస్తుందా?
*ఏ ఎండకాగొడుగు.
*ఏ పుట్టలో ఏ పామో ఏ గుళ్ళో ఏ మహత్యమో.
*ఏటి ఈతకు లంక మేతకు సరి.
*ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహావృక్షము.
*ఏడిచేదాని మొగుడొస్తే నామొగుడూ వస్తాడు.
*ఏనుగు బతికినా వెయ్యి వరహాలే చచ్చినా వెయ్యి వరహాలే.
*ఏనుగు మీద దోమవాలినట్లు.
*ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలోనే పడాలి.
*ఏటికి ఎదురీదినట్లు.
*ఏనుగుకు కాలు విరగడమూ, దోమకు రెక్క విరగడమూ ఒక్కటే.
*ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు.
*ఏకై వచ్చి మేకై దిగబడ్డాడు
*ఏ గాలికి ఆ చాప ఎత్తాలి
*ఐక మత్యమే మహాబలము.
*ఐశ్వర్యానికి అంతములేదు.
*ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు.
*ఒంటికంటే జంట మేలు.
*ఒక అబద్దము కప్పడానికి వెయ్యి అబద్దాలు.
*ఒక్కొక్కరాయి తీస్తూ వుంటే కొండైనా కరిగిపోతుంది.
*ఒకడి సంపాదన పదిమందిపాలు.
*ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.
*ఒక్క సిరా చుక్క లక్షల మొదళ్లకు కదలిక
_________________________________________________________
* కంటికి ఇంపయితే కంచానికీ ఇంపు.
* కందకి లేని దురద కత్తిపీటకా.
* కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
* కట్టిన ఇంటికి వంకలు చెప్పేవారు వెయ్యిమంది.
* కట్టిన వాడికి ఒక ఇల్లు అయితే కట్టని వాడికి వంద ఇళ్లు.
* కట్టిన వారు ఒకరైతే కాపురం చేసేవారు మరొకరు.
* కట్టె వంక పొయ్యి తీరుస్తున్నది.
* కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ.
* కడుపు నిండిన బేరము.
* కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా...వొండుకున్నమ్మ తినక మానుతుందా.
* కడుపులోని మాట అంటే ఊరంతా పాకుతుంది.
* కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు.
* కత్తి తీసి కంపలో వేసి ఏకుతో పొడుచుకున్నట్లు.
* కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు
* కత్తి పదునా? కలం పదునా?
* కథకు కాళ్ళూ ముంతకు చెవులు లేవు.
* కధ కంచికి మనం ఇంటికి.
* కననిది బిడ్డా కాదు. కట్టనిది చీరా కాదు.
* కనుక్కొని రారా అంటే కాల్చి వచ్చాడు.
* కన్ను యెర్రనయినా మిన్ను యెర్రనయినా కారక మానదు.
* కర్రి కుక్క కపిల గోవు అవునా.
* కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం.
* కలకాలపు దొంగ ఒకనాడు దొరుకుతాడు.
* కలిగినయ్య కలిగినయ్యకే పెట్టును, లేనయ్య కలిగినయ్యకే పెట్టును.
* కలిమిలేములు కావడి కుండలు.
* కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాదు.
* కల్పవృక్షం క్రింద గచ్చపొద వున్నట్లు.
* కరువులో అధికమాసం
* కల్లా కపటం లేని వారికి కష్టాలు.
* కష్టసుఖాలు కావటి కుండలు.
* కాకిలా కలకాలం కాక హంసలా ఆరునెలలు బతికితే చాలు
* కబుర్లతో కడుపు నిండదు
* కాకి గూటిలో కోకిల పిల్ల వలె.
* కాకి పిల్ల కాకికి ముద్దు.
* కాకి పుట్టి నలుపే, పెరిగీ నలుపే.
* కాకి ముక్కుకు దొండపండు.
* కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు.
* కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు.
* కాయ తీగకు బరువు కాదు.
* కాయని కడుపు పూయని చెట్టు.
* కారణము లేకనే కార్యము పుట్టదు.
* కాలం ఎంతో విలువైనది.
* కాలమొక్క రీతిని గడపవలెను.
* కాలయాపన కంటే నేరం లేదు.
* కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి.
* కాలుగాలిన పిల్లిలా తిరిగినట్లు.
* కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత.
* కాసుకు గతి లేదు, కోటికి కన్నేసినాడు.
* కుంపట్లో తామర మొలిచినట్లు.
* కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లు.
* కుక్కకాటుకు చెప్పుదెబ్బ.
* కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించు.
* కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకొనేవాడు.
* కుంచం అంత కూతురు ఉంటే మంచం మీదే కూడు.
* కుమ్మరి లేకుండా కుండ పుట్టునా.
* కుక్క కాటుకు చెప్పుదెబ్బ
* కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
* కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.
* కుల మెరిగి చుట్టము, స్థలమెరిగి వాసము.
* కులం కన్నా గుణం ప్రధానం.
* కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది.
* కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా.
* కీడించి మేలించాలి!
* కూటికి పేదయితే కులానికి పేదా.
* కూడు గుడ్డా అడగకపోతే, బిడ్డను సాకినట్లు సాకుతాను అన్నాడు.
* కూర్చుండి తింటూ వుంటే, కొండ కూడా సమసిపోతుంది.
* కాసుంటే మార్గముంటుంది.
* కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి
* కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెరిపినది.
* కొంత తెలుసుకోవడం తేలికే...అంతా తెలుసుకోవడమే కష్టం
* కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక కాస్తా ఊడిపోయిందట.
* కొండంత దూదికి కొండంత నిప్పు ఏల.
* కొండను తవ్వి యెలుకను పట్టినట్లు.
* కీడెంచి మేలెంచమన్నారు.
* కొండను మింగేవానికి గోపురం ఒక లెక్కా?
* కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా.
* కొరివితో తలగోక్కున్నట్లు.
* కోతి పుండు బ్రహ్మాండం.
* కోటి విద్యలు కూటి కొరకే.
* కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
* కోడికి కోపమొచ్చి ఉన్న ఈకలు పీక్కుందట
* క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
* కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
* కోతికి తేలుకుట్టినట్లు.
* కృషితో నాస్తి దుర్భిక్షం.
* కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు.
* కోపము పాపమునకు ధూపము.
* కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.
* కోరికలు కొండలెక్కుతుంటే అదృష్టాలు అడుగంటుతుంటాయి.
* కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట.
* కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
* కొత్తొక వింత పాతొక రోత.
* కోరు గింజలు కొంగులోకే సరి.
* గంగలో మునిగినా కాకి హంస అవుతుందా.
* గంతకు తగిన బొంత.
* గంధము అమ్మినచోట కట్టెలు అమ్మినట్లు.
* గతికితే అతకదు.
* గచ్చ పొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది.
* గడ్డ పలుగులు గాలికి కొట్టుకొని పోతూవుంటే, పుల్లాకు నా పని ఏమి అన్నదట.
* గడ్డము కాలి ఒకడు ఏడుస్తూ వుంటే, చుట్టకు నిప్పుయిమ్మని ఒకడు వెంబడించినట్టు.
* గతిలేనివాడు గాడిదకాళ్ళు పట్టుకున్నట్లు.
* గడ్డివాములో సూది వెదికినట్టు.
* గతిలేనమ్మకు గంజే పానకం.
* గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే.
* గాజుల బేరం భోజనానికి సరి.
* గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట.
* గుడి మింగే వాడికి నంది పిండీమిరియం.
* గుర్రాన్ని నది వరకు తీసుకెళ్లగలం కాని నీరు తాగించలేం
* గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు.
* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
* గుడ్ల మీద కోడిపెట్ట వలే.
* గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట .
* గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు.
* గురువుకు పంగనామలు పెట్టినట్లు
* గొంతెమ్మ కోరికలు.
* గోరు చుట్టు మీద రోకటి పోటు.
* గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు.
* గుడ్డి కన్నా మెల్ల మేలు.
* గుడ్డెద్దు చేలో పడ్డట్టు...
* గోటితో పోయేదానికి గొడ్డలెందుకు.
* గురువులేని విద్య గుడ్డి విద్య.
* గూట్లో దీపం నోట్లో ముద్ద.
* గడిచి బ్రతికామని గంతులు వేయకూడదు.
* గతుకులకు పోతే, బతుకులు పోయినవి.
* గాడిద గాడిదే, గుర్రము గుర్రమే.
* గోరుచుట్టుపైన రోకలి పోటు.
__________________________________________________________------
* చంక లోతుకు దిగిన వాడికి చలేమిటి?
* చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా గాలించినట్లు.
* చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్టు.
* చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు.
* చచ్చిన పామును కొట్టడానికి అందరు తయారు.
* చచ్చిన వాని కండ్లు చారెడు.
* చచ్చిన వాని పెండ్లికి వచ్చిందే కట్నం .
* చచ్చేంత వరకు వైద్యుడు విడిచిపెట్టడు, చచ్చినా పురోహితుడు విడిచి పెట్టడు.
* చదవేస్తే ఉన్న మతి పోయింది.
* చదివినవానికన్నా చాకలి నయము.
* చదువు కన్న గొప్ప ధనం లేదు.
* చదువు చారెడు... బలపాలు దోసెడు...
* చద్దికంటే ఊరగాయ ఘనం.
* చద్దికూడు తిన్నమ్మ మగని ఆకలి ఎరుగదు.
* చమత్కారం లేనిదే నమస్కారం లేదు.
* చాదస్తం అంటే చెరి సగం అన్నట్టు.
* చావా చావడు మంచం వదలడు.
* చావు కబురు చల్లగా చెప్పమన్నారు.
* చింత చచ్చినా పులుపు చావదు.
* చిత్తం శివుడి మీద భక్తి చెప్పులు మీద
* చిక్కితే దొంగ, చిక్కకుంటే దొర.
* చితికిన మనసు అతకదు.
* చిత్తం మంచిదయితే చేదు కూడా తీపి అవుతుంది.
* చిత్తశుద్ధి లేని పూజలేల? భాండ శుద్ధిలేని పాకమేల.
* చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టవలె.
* చిన్నక్క చిలక, పెద్దక్క గిలక, చూస్తే చుక్క, రేగితే కుక్క.
* చిలక ముక్కున దొండపండు వున్నట్లు.
* చిలికి చిలికి గాలి వాన అయినట్లు.
* చీకటి కొన్నాళ్ళు. వెన్నెల కొన్నాళ్ళు.
* చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్లు
* చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొన్నట్లు.
* చెట్టు ముందా, విత్తు ముందా.
* చెప్పటం తేలిక చేయడం కష్టం.
* చెప్పిన బుద్ధి కట్టిన సద్ది నిలవదు.
* చెప్పు కింది తేలు.
* చెప్పుడు మాటలు వింటే చేటు కలుగుతుంది.
* చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
* చెరువు ఎండితే చేపలు బయట పడతాయి.
* చెరువు మీద అలిగి కాళ్ళు కడుక్కోక పోయినట్టు.
* చెలిమి చేసేముందు బాగా అలోచించుకో ఆ తర్వాత మరేమి ఆలోచించకు.
* చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
* చేప పిల్లకు ఈత నేర్పవలెనా?
* చేసిన పాపం గోచీలో పెట్టుకొని కాశీకి పోయినా తీరదు, కాటికి పోయినా తీరదు.
* చేసిన పాపం చెబితే పోతుంది.
* చేసే పని వదిలి, నేసేవాని వెంట పోయినట్లు.
* చేసేవి తప్పులు, చెపితే నొప్పులు.
* చేసేవి లోపాలు, చెపితే కోపాలు.
* చొప్పవామిలో నిప్పుదాచుకున్నట్లు.
* ఛీ! కుక్కా! అంటే, ఏమక్కా! అన్నదట.
* చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్దాలు.
* చెలిమితో చేదు తినిపించవచ్చు బలిమితో పాలు తాగించలేము.
* చిన్న పిల్లలు లేని ఇల్లు ఇల్లూ కాదు, జీలకర్ర లేని కూర కూరగాదు.
* చక్కనమ్మ చిక్కినా చక్కనే (అందమే).
* చక్కని రాజమార్గముండగా సందుల్లో దూరడమెందుకు?
* చక్కెర తిన్న నోటితో తవుడు బొక్కినట్లు.
* చీడ అంటుతుంది గాని సిరి అంటదు.
* చూడ్డానికి శ్రీ వైష్ణవిలే, చూస్తే బుట్టెడు రొయ్యలు మాయం.
* చావుకు మళ్ళీ చావు వస్తుందా?
* చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు.
* చూస్తూ ఊరకుంటే మేస్తూ పోయిందట.
* చెప్పేవానికి చేసేవాడు లోకువ.
* చెవికోసిన మేకవలే అరుస్తాడు.
* చేనుకు ఎరువు మడికి మంద.
* చనువిచ్చిన - ఆలు చంకనెక్కు.
* చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడు.
* చల్లకుండకు, చంటిబిడ్డకు చాటుండాలి.
* చాకలి కొత్త మంగలి పాత.
* జగమెరిగిన బ్రాహ్మణుడికి జంఝమేల?
* జన్మలన్నిటికన్నా మానవ జన్మ శ్రేష్టం.
* జన్మకొక శివరాత్రి అన్నట్లు.
* జన్మతో పుట్టినది చెప్పుతో కొట్టినా పోదు.
* జయం ఉన్నంత వరకు భయం లేదు.
* జయాపజయాలు దైవాధీనంబు.
* జరుగుబాటు తక్కువ ... అదిరి పాటెక్కువ.
* జాగ్రత్త - జీవితాన్ని రక్షిస్తుంది.
* జింక ఏడ్పు వేటగానికి ముద్దా.
* జింకకు కొమ్ములు బరువా.
* జీతం లేని నౌకరు, కోపం లేని దొర లేరు.
* జీవితం నూరేళ్ళ పంట వెయ్యెళ్ళ తపస్సు.
* జీవితం వడ్డించిన విస్తరి కాదు.
* జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందట.
* జోడులేని బతుకు, తాడు లేని బొంగరం.
______________________________________________________________________________________
* టంకం పెట్టిన గుడిసె! దెబ్బకొడితే వడిసె!!
* టెంకాయలు తెచ్చినోడ... నీ మాడునే కొట్టుకోరా.
* డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
* డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు.
* డబ్బు కోసం గడ్డి తినే రకం లాగా...
* డబ్బు పాపిష్టిది.
* డబ్బుకు ప్రాణానికి లంకె!
* డబ్బుకు లోకం దాసోహం!
* డబ్బుయిచ్చి తేలు చేత కుట్టించుకున్నట్లు.
* డబ్బురాని విద్య! కూడు చేటు.
* డబ్బులు వుంటే కొండ మీది కోతి అయినా దిగివస్తుంది.
* డబ్బుఇవ్వను డబ్బు మీది దుమ్ము ఇవ్వను.
* డాబుసరి బావా! అంటే, డబ్బులేదు మరదలా అన్నాడట.
* ఢిల్లీకి పోయి... ఉల్లిగడ్డ తెచ్చినట్లు!
* డూడూ బసవన్న అంటే తలాడించినట్లు.
* డొంక తిరుగుడు మాటలు.
* డొంకలో దాగితే పిడుగుపాటు తప్పుతుందా?
* ఢిల్లీ పాదుషా కూతురైనా పెళ్ళికొడుకుకు లోకువే.
__________________________________________________________________________________
* తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓదారుస్తుంది.
* తండ్రి చేస్తే పెత్తనం తెలుస్తుంది! తల్లి చేస్తే కాపురం తెలుస్తుంది.
* తగిలించుకోవడం సులభం, వదిలించుకోవడం కష్టం.
* తడి గుడ్డతో - గొంతులు కోసినట్లు!
* తన కడుపు కనుక పండితే పక్కింటాయన తల నీలాలు ఇస్తానని మొక్కుకుందట.
* తన కోపమే తన శత్రువు!
* తన సొమ్మే అయినా దాపుగా తినవలెను.
* తనకు తెలియని అబద్ధం లేదు. తల్లికి తెలియని చూలూ లేదు.
* తనది తాటాకు! ఇవతల వాళ్ళది ఈతాకు!
* తలగడ కింద తాచు పామువలె.
* తల్లి పుట్టినిల్లు మేనమామ వద్ద పొగిడినట్లు.
* తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు.
* తవుడు తిని చచ్చేవానికి - విషం పెట్టేవాడు వెఱ్ఱివాడు!
* తనకు తెలియదు, ఒకడు చెబితే వినడు
* తాచెడ్డ కోతి వనమెల్ల చెరచినట్లు.
* తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు...
* తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా.
* తాటిచెట్టునీడన, పాలుతాగినా కల్లు తాగారనుకుంటారు.
* తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు.
* తాతకు దగ్గులు నేర్పినట్టు.
* తాను దూర సందులేదు. మెడకొక డోలు.
* తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు
* తాదూర కంతలేదు మెడకో డోలు
* తాళము నీవద్ద చెవి నావద్ద.
* తాళిబొట్టు బలం వలన - తలంబ్రాల వరకు బ్రతికినట్లు!
* తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కాదిగా సరిపొయిందంట.
* తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి.
* తిండికి ఏనుగు, పనికి పీనుగు.
* తిండికి ముందు తగాదాకి వెనుక ఉండాలి
* తినబోతూ రుచులు అడిగినట్లు.
* తినగా తినగా గారెలు చేదు.
* తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
* తన కోపమే తన శత్రువు.
* తలమీద మొట్టి నెత్తి ఎంత గట్టి అన్నట్టు
* తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట.
* తినే తినే కూటిలో మన్ను పోసుకున్నట్లు.
* తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు.
* తిన్న ఇంటివాసాలు లెక్క పెట్టినట్లు.
* తిన్నదాని కంటే అరిగిందే బలం.
* తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది.
* తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము.
* తంతే గారెల బుట్టలో పడ్డట్లు.
* తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవు.
* తీగ లాగితే డొంకంతా కదులుతుంది.
* తీగకు కాయ బరువా?
* తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది.
* తుమ్ముకు తమ్ముడు లేడు కాని, ఆవలింతకు అన్న ఉన్నాడు.
* తులసి వనంలో గంజాయి మొక్క.
* తూనీగలాడితే తూము వర్షం!
* తెగేదాకా లాగరాదు.
* తెల్లనివన్నీ పాలూకావు - నల్లనివన్నీ నీళ్ళూకావు.
* తేరగా వచ్చింది! ఊరకే పోతుంది!
* తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు తెగ కుట్టిందట.
* తొండ ముదిరితే ఊసరవెల్లి.
* తొలకరి వాన మొలకకు తల్లి.
* తోక తెగిన కోతిలాగా.
* తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్లినట్లు...
* తోరణం కట్టగానే పెళ్ళి అయినట్టు.
* దంచేదొకరు, పక్కలెగరేసే దింకొకరు.
* దప్పిక గొన్నప్పుడు బావి త్రవ్వినట్లు.
* దమ్మిడీ ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు.
* దయ గల హృదయమే దైవ మందిరం.
* దయతో దండాలు పెడితే, పడవేసి బందాలు పెట్టినట్లు.
* దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే.
* దరిద్రానికి మాటలెచ్చు! తద్దినానికి కూరలెచ్చు!
* దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
* దరిద్రుడు మరణం కోరుకుంటాడు... భాగ్యవంతుడు భాగ్యాన్ని కోరుకుంటాడు.
* దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు.
* దాతలిచ్చిన పాల కంటే... ధరణి ఇచ్చిన పాలు మేలు.
* దానం చెయ్యని చెయ్యీ, కాయలు కాయని చెట్టూ ఒకటే.
* దారిన పోయే శనిని ఇంటికి తెచ్చుకున్నట్టు.
* దాసి కొడుకైనా కాసులు గలవాడే రాజు.
* దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
* దిగితేగాని లోతు తెలియదు.
* దిగు, దిగుమనేవాళ్లే కానీ దిగే వాళ్ళెవరూ లేరు.
* దిన దిన గండం వెయ్యేండ్ల ఆయుష్షు.
* దివాణంలో దిక్కు లేదు! అంగటిలో ఉప్పు లేదు!
* దివిటీ ముందు దీపం పెట్టినట్టు.
* దిశ కుదిరిన... దశ కుదురు.
* దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి.
* దీపావళికి దీపమంత చలి.
* దుక్కి కొద్దీ పంట! బుద్ది కొద్దీ సుఖం!!
* దుత్తకు పాల రుచి తెలుసునా.
* దున్న ఈనిందంటే దూడను కట్టేయమనట్టు.
* దున్న కలిగితే మన్ను ముట్టవలె.
* దున్నపోతు మీద వర్షం కురిసినట్లు.
* దురాశ దుఃఖమునకు చేటు.
* దూడ, తల్లి ఉండగా గుంజ అరిచినట్లు.
* దూషణ ఆకాశాన విరిసిన రాయి వంటిది అది విసిరిన వానిమీదే పడుతుంది
* దూరపు కొండలు నునుపు.
* దేవుడు వరమిచ్చినా... పూజారి వరమియ్యడు.
* దేవుని కనిపెట్టిన వాడే... అందరి కంటే తెలివైన వాడు.
* దేవుని నమ్మిన వాడు... ఎన్నడూ చెడిపోడు.
* దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే!
* దెయ్యాలు వేదాలు పలికినట్లు.
* దొంగ చేతికి తాళాలిచ్చినట్లు.
* దొంగకు తేలు కుట్టినట్లు.
* దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి.
* దొంగకు అందరి మీద అనుమానమే.
* దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్లు.
* దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు.
* దొరికితే దొంగ దొరకకపోతే దొర.
* దోనె చేయబోయి సోల చేశాడట!
* దోవలో కూర్చోని దొబ్బులు తిన్నట్లు.
* ధనమేరా అన్నిటికి మూలం.
* ధనవంతుని చెరిచే వాడు లేడు! దరిద్రుని బాగు చేసేవాడు లేడు.
* ధార లేని తిండి... దయ్యపు తిండి.
* దాసుని తప్పు దండంతో సరి.
* ధైర్యం లేని రాజు యోచన లేని మంత్రి.
* ధైర్యమే సాహసం! ఉబ్బసమే దగ్గు!
* ధైర్యే సాహసే లక్ష్మి.
* నంగకు నాలుగట్లు ఇస్తే... నమలకుండా మింగినట్లు.
* నంది అంటే నందే! పంది అంటే పందే !
* నక్క ఎక్కడ, నాగలోక మెక్కడ ?
* నక్క వినయం - కొంగ జపం
* నక్కలలో నక్కగా నటించవలె.
* నట్టింట వుండి నా భాగ్యమంటే... ఉట్టిమీద నుంచి ఊడిపడుతుందా!!
* నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు.
* నడమంత్రపు సిరి నరం మీద పుండు
* నడుము మునిగేదాక చలి - నలుగురు వినేదాకానే సిగ్గు.
* నన్ను ముట్టుకోకు నామాల కాకి.
* నమ్మినాను రామన్నా అంటే నట్టేట ముంచుతానన్నట్లు.
* నరాలు లేని నాలుక... నానా విధాలుగా మాట్లాడినట్లు.
* నల్ల చీర కట్టిన వాళ్ళంతా... నా పెళ్ళాలే అన్నట్లు.
* నమిలే వానికన్న మింగేవాడే ఘనుడు
* నడవడికలు చక్కపెట్టేది నాటకం
* నవ్వు నాలుగు విధాలా చేటు.
* నా వేలు పుచ్చుకొని నా కన్నే పొడిచినావా?
* నాకే లేక నాకుతుంటే నీకు నైవేద్యమా.
* నాగలి మంచిది కాకపోతే ఎడ్లేమి చేస్తాయి?
* నాదమంటే గంట... వాదమంటే తంటా.
* నారు పోసిన వాడు నీరు పోయడా?
* నానిన భూమిలో నవధాన్యాలు పండును.
* నారు, నీరు, నోరు ఉంటే...ఏ రాజ్యం లో ఉన్నా ఒకటే.
* నారుకెళ్లిన రైతు నూర్పిళ్ల నాటి కొచ్చి ఈ చేలో కుప్పేశారేంటని కేకలేశాట్ట
* నిత్యకల్యాణం - పచ్చతోరణం
* నిమ్మకు నీరెత్తినట్లు.
* నిండిన కడుపు నీతి ఎఱుగదు.
* నిండుకుండ తొణకదు.
* నిజం నిప్పులాంటిది
* నిజం చెపితే వున్న ఊరు కూడా మెచ్చదు.
* నిజం చెప్పేది పసిబిడ్డలు, తప్పతాగినవాళ్ళు.
* నిప్పుకు చెదలంటునా.
* నిప్పు ముట్టనిది చేయి కాలదు.
* నిదానమే ప్రధానము.
* నేటి విద్యార్దులే రేపటి పౌరులు.
* నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.
* నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు.
* నీ నెత్తిమీద ఏదో ఉందంటే అదేదో నీచేత్తోనే తీయమన్నాడట
* నీతి లేనివాడు కోతికంటే బీడు
* నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు.
* నేతగాడికేలరా కోతి పిల్ల.
* నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది.
* నోరు ఉన్న వాడిదే రాజ్యం.
* నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది
* నోరే వీపుకు చేటు.
* నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి.
* నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు.
_______________________________________________
* పగలు నిద్ర పనికి చేటు, రాత్రి జాగరణ ఒంటికి చేటు.
* పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు.
* పదిమంది నడిస్తేనే దారవుతుంది
* పసిబిడ్డ - పాలకుండ క్షణం తీరికనివ్వవు
* పడ్డవాడెప్పుడు చెడ్డవాడుకాదు
* పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు
* పదిమందిలో పడ్డ పాము చావదు.
* పదిరాళ్ళు వేస్తే ఒక్క రాయైనా తగలదా.
* పరుగెత్తి పాలు తాగటం కన్నా కూర్చొని గంజి తాగడం మంచిది.
* పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
* పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు.
* పాడగా పాడగా పాట, మూల్గగా, మూల్గగా రోగం.
* పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
* పానకంలో పుడక
* పిలవని పేరంటము చెప్పని వక్కపొద్దు.
* పిల్లికి ఎలుక సాక్షి.
* పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు.
* పులికడుపున మేక పుడుతుందా?
* పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
* పులి కంటే గిలి పెద్దది
* పూజకన్నా బుద్ధి, మాటకన్నా మనసు ప్రధానం.
* పెనములోనుంచి పొయ్యిలో పడ్డట్టు.
* పడిశము పది రోగాల పెట్టు.
* పదిమందిలో పడ్డ పాము చావదు.
* పండినా, ఎండినా పని తప్పదు.
* పండుగనాడు కూడా పాత మొగుడేనా?
* పండ్లు చెట్టుకు భారమా?
* పండ్లూడగొట్టుకోవడానికి ఏ రాయైతేనేమి?
* పంది ఎంత బలిసినా నంది కాదు.
* పండిత పుత్రః పరమ శుంఠ
* పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు.
* పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట
* పందికేమి తెలుసురా పన్నీరు వాసన?
* పగలు చెయ్యూపితే రానిది, రాత్రి కన్ను గీటితే వస్తుందా?
* పాండవుల సంపాదన కౌరవుల తద్దినాలకు సరి.
* పాము కాళ్ళు పామునకెరుక
* పిండి కొద్దీ రొట్టె.
* పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.
* పెయ్యను కాపాడమని పెద్దపులికి అప్పచెప్పినట్లు.
* పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు
* పెద్దల మాట పెరుగన్నం మూట
* పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్లు.
* పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గది లాంటిది
* పేరు గొప్ప ఊరు దిబ్బ
* పెళ్ళంటే నూరేళ్ళ పంట
* పైసా! పైసా! ఏంచేస్తావంటే ప్రాణం వంటి మిత్రుణ్ణి పగ చేస్తానందట.
* పొట్టివానికి పుట్టెడు బుద్ధులు.
* పోరాటం లేని ఆరాటం పనికిరాదు.
* పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట
* పోరు నష్టం పొందులాభం.
* పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు.
* ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు.
* బందరు బడాయి, గుంటూరు లడాయి.
* బంధువుతోనైనా పాలి వ్యవసాయం చేయరాదు.
* బట్ట అప్పు, పొట్ట అప్పు ఎక్కువ కాలం నిలవదు.
* బట్టతలమ్మ పాపిట తీయమన్నట్టు.
* బయట పులి, ఇంట్లో పిల్లి.
* బలవంతుడికి గడ్డిపరకా ఆయుధమే.
* బాలవాక్కు బ్రహ్మ వాక్కు.
* బిడ్డలను కన్నమ్మ, భిక్షం పెట్టినమ్మ చెడరు.
* బుద్దిమంతురాలి జుట్టు భుజాలు దాటదట.
* బుద్ధుంటే బువ్వ తింటావు లేకుంటే గడ్డి తింటావు.
* బెల్లమున్నచోటే ఈగలు.
* బొండు మల్లెలు బోడి తల కెందుకు?
* బొమ్మకు మొక్కినా నమ్మకం ఉండవలె.
* బూడిదలో పోసిన పన్నీరు
* బొమ్మకు మొక్కినా నమ్మకముండాలి.
* బలవంతునికి గడ్డి పరకా ఆయుధమే.
* బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడట.
* బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు.
* బ్రాహ్మణుడి నోరు - ఏనుగు తొండం వూరుకోవు.
* భంగు తాగేవానికి హంగుగాళ్ళు పదిమంది.
* భక్తివచ్చినా - పగవచ్చినా పట్టలేరు.
* భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలి.
* భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట.
* భరణిలో పుడితే ధరణిని ఏలు.
* భరణిలో బండలు పగులును, రోహిణిలో రోళ్ళు పగులును.
* భరించ లేనిదే బాధ.
* భక్తి లేని పూజ పత్రి చేటు
* భాషలు వేరైనా భావమొక్కటే.
* భూమినీ రాజునీ కొలిచినవాడు చెడడు.
* భూదేవంత పీట ఆకాశమంత పందిరి.
* భోజనానికి ముందు బీరకాయ.
* భోజనానికి రమ్మంటే పట్టుచీర కట్టుకొని వస్తానన్నట్లు.
* భోజుని వంటి రాజుంటే కాళీదాసువంటి కవీ వుంటాడు.
* బెల్లం కొట్టిన రాయిలాగా
* మంచి మాటకు మంది అంతా మనవాళ్లే
* మంచి పుస్తకాన్ని ముందు చదవండి... తర్వాత దాన్ని చదివే అవకాశం దొరక్కపోవచ్చు
* మజ్జిగ పోయించుకోవడానికి వెళ్ళి గేదెను బేరం చేసినట్టు
* మంచి కొంచెమైనా చాలు. విత్తనం చిన్నదైనా చాలు.
* మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
* మంచినీటిని కన్నతల్లిని ఎంచడం నేరం.
* మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు.
* మగడు లేని అత్తిల్లు, తల్లిలేని పుట్టిల్లు వల్లకాటితో సమానం.
* మజ్జిగకు వచ్చి ముంత దాయటమెందుకు?
* మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు.
* మనిషి పేద అయితే మాటకు పేదా
* మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు
* మనిషికి మాటే అలంకారం
* మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు.
* మనిషికొక మాట పశువుకొక దెబ్బ.
* మంత్రాలకు చింతకాయలు రాల్తాయా.
* మనసులోని మర్మం ముఖమే వెల్లడించును.
* మానవసేవయే మాధవ సేవ.
* మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి
* మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు...
* మామ బంతిన కూర్చొని అత్త బంతిన లేచినట్లు.
* మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె.
* మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా.
* మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తూ ఏం తెస్తావు?
* ముంజేతి కంకణముకు అద్దము యెందుకు.
* ముండా కాదు ముత్తైదువా కాదు.
* ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.
* ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
* ముండ మొయ్యవచ్చుగాని, నింద మొయ్యరాదు.
* ముందు ముచ్చట్లు - వెనుక చప్పట్లు.
* ముందు వచ్చిన చెవుల కంటే, వెనుక వచ్చిన కొమ్ములు వాడి.
* ముందు నుయ్యి వెనుక గొయ్యి
* ముక్కు ఉండేంతవరకే పడిశముంటుంది.
* మునిగే వాడికి తెలుసు నీటిలోతు.
* ముల్లు వచ్చి అరిటాకు మీదపడ్డా, అరిటాకు ముల్లు మీదపడ్డా అరిటాకుకే నష్టం.
* మూడేండ్లనాడు లేని సద్భుద్ధి ముప్పయ్యేండ్ల నాడు రాదు.
* మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.
* మెడబెట్టి నెడితే చూరుపట్టుకొని వ్రేలాడినట్లు.
* మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట.
* మెరిసేదంతా బంగారం కాదు.
* మొరిగే కుక్క కరవదు.
* మొండి వాడు రాజు కంటే బలవంతుడు
* మొదలేదో, చివరేదో తెలియకపోతే ఎట్లా?
* మేకపిల్లని చంకలో పెట్టుకుని ఊరంతా వెదకినట్లు
* మొసేవానికి తెలుసు కావడి బరువు.
* మేకపోతు గాంభీర్యంలాగా.
* మేసే గాడిదను కూసేగాడిద వచ్చి చెడగొట్టినట్లు.
* మొక్కయి వంగనిది, మానై వంగునా?
* మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిందట.
* మోసే వాడికి తెలుస్తుంది బరువు.
* యజ్ఞానికి ముందేమిటంటే, తలక్షవరం అన్నట్లు.
* యతి అంటే, ప్రతి అన్నట్లు.
* యధార్ధవాది లోక విరోధి.
* యధా రాజా తధా ప్రజా
* యధార్ధమునకు ఏడు చుట్లు అక్కరలేదు.
* యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు.
* యెద్దు పుండు కాకికి ముద్దు.
* యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు.
* యే ఎండకు ఆ గొడుగు.
* యే గాలికి ఆ చాప
* యేకులు పెడితే బుట్టలు చిరుగునా.
* రెండు పడవలపైన కాళ్ళు పెట్టినట్లు.
* రెక్కాడితేగాని డొక్కాడదు.
* రక్షించిన వాడినే భక్షించినట్లు.
* రాగి పోగులు తగిలించుకున్నావేమిరా? అంటే నీకు అవి గూడా లేవు కదా! అన్నాడట.
* రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము.
* రామాయణంలో పిడకల వేట.
* రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు.
* రోగమొకటి... మందొకటి.
* రాజు తలిస్తే దెబ్బలకు కొదువా.
* రాజుగారి నోట్లో తాటి చెట్టు మొలిచిందట
* రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు.
* రాజుల హృదయం రాతితో సమం.
* రోజులు మంచివని పగలే దొంగతనానికి బయలుదేరినట్లు.
* రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
* రోట్లో తలపెట్టాక రోకలి పోటుకు వెరచినట్లు.
* రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణింపు.
* రౌతుకొద్దీ గుర్రం.
* రైతు దున్నితే రాజులకు అన్నం.
* రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు.
* రానున్నది రాకమానదు - పోనున్నది పోకమానదు.
* రేపటి నెమలి కంటే, నేటి కాకి మేలు.
* రాజుగారి బిందెలో పాలుపోసినట్లు
* రాత్రివేళ సూర్యునికోసం కన్నీరు పెట్టుకుంటే నక్షత్రాలు కూడా కనిపించవు
* రాగిపోగులు తగిలించుకున్నావేమిట్రా అంటే నీకు అవి కూడా లేవుగా అన్నట్లు
* రామాయణం అంతావిని రాముడికి సీతేమవుతుంది అని అడిగినట్లు.
* రోలు పోయి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు.
* రేవతి వర్షం రమణీయం.
* రోషం లేని బంటుకు మోసం లేదు.
* రోషంలేని మూతికి మీసమెందుకు?
* రోహిణి ఎండకు రాళ్ళు పగులుతాయట.
* లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే.
* లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడు కాలేవు.
* లక్షణం చెడితే అవలక్షణం.
* లక్షాధికారైనా కావాలి - భిక్షాధికారైనా కావాలి.
* లోకులు పలు కాకులు.
* లోగుట్టు పెరుమాళ్లకెరుక
* లేడి కడుపున పులి పిల్ల పుట్టునా?
* లేడికి లేచిందే పరుగు
* లేని బావ కంటే, గుడ్డి బావే మేలు.
* లేని దాత కంటే ఉన్న లోభి నయం.
* లేనిదాని కోసం పోతే ఉన్నది కాస్తా ఊడిపోయిందట.
* లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట.
* లేనివాడు లేక ఏడిస్తే, వున్నవాడు తినలేక ఏడ్చాడట.
* లోపల కంపు, వెలుపల సొంపు
* లోభి సొమ్ము దొంగల పాలు.
* లోభికి నాలుగందాల నష్టం.
* లేవలేని అత్తకు వోపలేని కోడలు.
* వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి.
* వెంట రావద్దంటే, ఎత్తుకోమని ఏడ్చినాడట.
* వంటింటి కుందేలు ఎక్కడికి పోతుంది.
* వండనమ్మకు ఒక్కటే కూర - అడుక్కునే అమ్మకు ఆరు కూరలు.
* వండలేనమ్మకు వక్కణంబులు గొప్ప.
* వర్తమానం నుండే మన భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది
* విగ్రహపుష్టి నైవేద్యనష్టి.
* వచ్చింది కొంత - పఠించింది కొంత.
* వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.
* విద్య లేని వాడు వింత పశువు.
* వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయి.
* వట్టి మాటల వల్ల పొట్టలు నిండుతాయా?
* వేటుకు వేటు, మాటకు మాట.
* వాడికి వీడికి, నిప్పుకు ఉప్పుకు వున్నట్లు.
* వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పరవాలేదు.
* వడ్లు, గొడ్లు వున్నవాడిదే వ్యవసాయం.
* విడవమంటే పాముకు కోపం. పట్టమంటే కప్పకు కోపం.
* విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకోటి మొలుచునా.
* వినాశకాలే విపరీత బుద్ధి.
* వెనక చింతించుట వెర్రితనము.
* వెంటరావద్దంటే ఎత్తుకోమని ఏడ్చాడట
* వెన్నతిన్నవాడు వెళ్ళిపోతే చల్లతాగిన వాడ్ని కొట్టినట్లు.
* వానరాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు.
* వెనుకా, ముందూ చూచి మాట్లాడండి అన్నట్టు.
* వీపు మీద కొట్టవచ్చును గాని కడుపుమీద కొట్టరాదు.
* వ్యాధికి మందుంది కానీ విధికి మందా?
* వెయ్యి ఇండ్ల పూజారి ఎంత వెతికినా దొరకడు.
* వరి పండని ఊరు - దొర వుండని ఊరు ఒకటే.
* వర్గ రహితమైనదే స్వర్గం.
* వాపును చూసి బలము అనుకున్నాడట
* వెర్రి వేయి విధాలు, పైత్యం పదివేల విధాలు.
* వ్రాసేవాణ్ణి, కోసేవాణ్ణి, గీసేవాణ్ణి నమ్మరాదు.
* వేషాలన్నీ గ్రాసాలకే!
* వేషాలు కోసం దేశాల పాలయినట్లు.
* వస్తుగుణం తెలియనయ్య, వైద్యంలో మొనగాడే!
* వేసిన వత్తికి - పోసిన చమురుకు సరి.
* శొంఠి లేని కషాయం ఉంటుందా?
* శాంతము లేక సౌఖ్యము లేదు ఏవ్వరికైనా
* శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు.
* శనిగాడికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ.
* శనగలు తిని చేయి కడుక్కున్నట్టు.
* శంఖంలో పోస్తేనే తీర్థం
* శ్రీ రంగనీతులు చెప్పే వారేగాని, ఆచరించే వారు లేరు.
* శ్రుతిమించి రాగాన పడినట్లు.
* శీలము లేని సౌందర్యం తావిలేని పువ్వు వంటిది.
* శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
* శివరాత్రికి చింతాకంత చెమట.
* సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
* శ్వాస వుండే వరకు ఆశవుంటుంది.
* శుభం పలకరా పెండ్లికొడకా! అంటే పెళ్ళికూతురు ముండెక్కడ అన్నాడట.
* షష్టి నాడు చాకలివాడైనా ప్రయాణం చేయడు.
* సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోని వారూ వస్తారు.
* సింగినాధం - జీలకర్ర
* సిగ్గు విడిస్తే శ్రీరంగమే.
* సంచి లాభం చిల్లు కూడదీసింది.
* సంతోషం సగం బలం.
* సందు దొరికితే చాలు మూడంకె వేస్తాడన్నట్లు.
* సంపాదన ఒకరిది అనుభవం ఇంకొకరిది.
* సంసారి తిరిగి చెడితే సన్యాసి తిరగక చెడిపోయాడంట.
* సగం పెట్టి మేనత్త అన్నట్టు
* సిగ్గుచెడ్డా ఫలితం దక్కాలి
* సెగలేనిదే పొగరాదు.
* సాతాని పీకులాటలాగా.
* సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది
* సన్యాసం పుచ్చుకున్నా కావడి బరువు తప్పలేదు.
* సర్వేజనా: సుఖినోభవంతు
* సొమ్మొకడిది - సోకొకడిది.
* సోమరితనం చీడ పురుగువంటిది.
* సమయం తప్పితే కాళ్ళు - సమయం వస్తే రాళ్ళు.
* సాము నేర్చిన వానికే చావు గండం
* సముద్రమైనా ఈదవచ్చుగానీ సంసారం ఈదలేరు
* సిరి పోయినా చిన్నెలు పోలేదు.
* సరసము విరసము కొరకే
* స్వామికార్యం, స్వకార్యం కలసివచ్చినట్లు
* స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పలేదన్నట్లు
* సుఖాలు పూవులవంటివి, అనుభవించగానే అంతరిస్తాయి.
* సున్నం కొడితేగాని శుద్దిగాదు
* సూదిని తీసుకెళ్ళి దూలానికి గుచ్చినట్లు
* హద్దులో వుంటేనే ముద్దూ ముచ్చట.
* హనుమంతుని ముందు కుప్పి గంతులా?
* హేమా హేమీల్లాగా
* హొరు గాలిలో దీపం పెట్టి ఓరి దేవుడా! నీ మహత్యం చూపించు అన్నట్లు
* హరుని ఎరుకలేక ఆకులల్లాడునా?
* హస్తలో ఆకులాడితే చిత్తలో చినుకు పడదు.
* హస్తలో చల్లితే అక్షింతలకైనా రావు
* క్షణం చిత్తం - క్షణం మాయ
* క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదు.
* క్షేత్రమెరిగి విత్తనం వేయాలి.
* క్షేమ సమాచారాలడిగినట్లు
* క్షేమంగా పోయి లాభంగా రమ్మన్నట్టు.
* క్షవర కళ్యాణంలాగా