జనరల్ నాలెడ్జ్


                           పోటీ పరీక్ష ఏదైనా సరే, అత్యుత్తమ అభ్యర్ధులను ఎంపిక చేయటమే దాని లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు
 ఆ అభ్యర్థికి విభిన్న అంశాలపై స్థూల పరిజ్ఞానం (జనరల్ నాలెడ్జ్) ఉండాలని నియామక సంస్థలు ఆశిస్తాయి. చివరకు ఈ రెండు అంశాల్లో (టెక్నికల్ + జనరల్ నాలెడ్జ్) ప్రతిభ చూపిన అభ్యర్థే ఉద్యోగానికి ఎంపికవుతాడు.

                           వ్రాత పరీక్షల్లోనే కాదు; ఇంటర్వ్యూల్లో కూడా జీకే ఎంతో కీలకం. ఈ రోజుల్లో పిచ్చాపాటీ సంభాషణలకు కూడా జీకే ఎంతో అవసరమని తెలిసిందే. విభిన్న అంశాల్లో సాధారణ అవగాహన లేని వ్యక్తికి సమాజంలో పరిగణ ఉండటం లేదు. ఈ రకంగా చూస్తే విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ జనరల్ నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవటం తప్పనిసరి అని తెలుస్తోంది.

    * ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
          జ)  వాషింగ్ టన్.
    * ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
          జ)  తాబేలు.
    * తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
          జ)  చెక్క
    * మహా భారతానికి గల మరో పేరు?
          జ)  జయ సంహిత.
    * హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?
          జ)  ఐరన్.
    * రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
          జ)  తులసీ దాస్.
    * నవ్వించే వాయువు ఏది?
          జ)  నైట్రస్ ఆక్సైడ్.
    * ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
          జ)  జూన్ 5.
    * చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
          జ)  నీల్ ఆమ్ స్ట్రాంగ్.
    * రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?
          జ)  మార్స్.
    * రేడియం దేనినుండి లభిస్తుంది?
          జ)  పిచ్ బ్లెండ్.
    * అత్యధిక జనభా గల దేశమేది?
          జ)  చైనా.
    * శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
          జ)  పాల ఉత్పత్తి.
    * సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు?
          జ)  రోమ్.
    * తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
          జ)  సెరి కల్చర్.
    * ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది
          జ)  2005-2015.
    * భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
          జ)  ఎన్నికల సంఘం.
    * ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
          జ)  జెనీవా.
    * డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
          జ)  ఇండోనేసియా.
    * ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
          జ)  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
    * భారతదేశ అధికార మతం?
          జ)  లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
    * మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
          జ)  కారల్ మార్క్స్.
    * ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
          జ)  రాజకీయ హక్కు
    * డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జశ్వంత్‌సింగ్.
    * మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
          జ)  భూమి.
    * ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
          జ)  న్యూయార్క్
    * భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
          జ)  ఆంధ్రప్రదేశ్.
    * మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
          జ)  ఎనిమిది.
    * మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
          జ)  28.
    * డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
          జ)  టెన్నిస్
    * పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
          జ)  నర్గిస్ దత్
    * హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
          జ)  సంస్కృతం
    * పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
          జ)  రెనిన్.
    * మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
          జ)  చిక్కుడు గింజ ఆకారంలో.
    * మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
          జ)  2.
    * ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
          జ)  ఇండియా.
    * ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
          జ)  రాజా మన్నార్ కమీషన్.
    * సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
          జ)  1924.
    * ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
          జ)  1 లక్ష యభై వేలు.
    * వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?
          జ)  వజ్రం.
    * మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
          జ)  ఐ.సి.ఐ.సి.ఐ.
    * 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది?
          జ)  భారత్.
    * అధిక సంఖ్యలో అణు రియాక్టర్‌లను కలిగి ఉన్న దేశం ఏది?
          జ)  అమెరికా.
    * టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం?
          జ)  బ్రిటన్.
    * 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జ్యోతి ట్రెహన్.
    * క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది?
          జ)  పంజాబ్ నేష్నల్ బ్యాంక్.
    * ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
          జ)  ఐఐయం అహ్మదాబాద్.
    * బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
          జ)  జాకాల్ అనే మిశ్రమంతో.
    * పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
          జ)  తమిళనాడు.
    * నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
          జ)  ఫాథమ్.
    * పింజర్ ' నవల రచయిత్రి ఎవరు?
          జ)  అమృతా ప్రీతమ్.
    * ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
          జ)  చైనా.
    * భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
          జ)  మహారాష్ట్ర
    * ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
          జ)  డెహ్రాడూన్.
    * వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
          జ)  డాక్టిలోగ్రఫీ.
    * రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
          జ)  గుజరాత్.
    * భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
          జ)  26 జనవరి 1950.
    * మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
          జ)  మదన్ మోహన్ మాలవ్య.
    * దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
          జ)  శ్రీనగర్.
    * భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
          జ)  అస్సాం.
    * అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
          జ)  4 సంవత్సరాలు.