మాయా ప్రపంచము

Picture
                                                           హ్యారీ వెళ్ళిన మాయా ప్రపంచము, మామూలు ప్రపంచానికి దూరంగా ఉన్నపటికీ, మన ప్రపంచముతో చాలా దగ్గర సంబంధము కలిగి ఉంటుంది. నార్నియా ప్రపంచములో ప్రత్యేక విశ్వము , లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో మిడిల్ ఎర్త్ ఒక గొప్ప గతముగా ఉండగా, హ్యారీ పాటర్ లోని మంత్ర ప్రపంచము మన పక్కన ఉండి, మాంత్రికులు సాధారణమైన పనులు చేస్తూ ఉంటారు. చాలా సంస్థలు, లండన్ వంటి నగరాలు గుర్తింప బడేవి గా ఉంటాయి. విడి విడి గా దాగి ఉన్న వీథులు,ఎవ్వరూ చూడని పురాతన బార్లు, మ్యాజిక్ తెలియని వారికి (మగుల్) కనబడని ఒంటరి భవనాలు,కోటలు ఉంటాయి. మంత్ర శక్తి నేర్చుకునే దాని కన్నా పుట్టుక తో వచ్చేదే ఎక్కువ. హాగ్వార్ట్స్ స్కూల్ కు వెళ్ళడము ఆ విద్యను వశపరుచుకోవడానికి. చాలా మంది మంత్రగాళ్ళకు పుట్టుక తోనే మంత్ర శక్తి ఉంటుంది కనుక వారికి మగుల్ ప్రపంచము ఉందని తెలియదు. (మగుల్ ప్రపంచము కూడా మామూలు ప్రపంచము లాగానే కనపడుతుంది.) అయినా కాని మ్యాజిక్ ప్రపంచము, దానిలోని విచిత్ర వస్తువులు చాలా సాధారణంగా చూపించబడ్డాయి. కథ లో ముఖ్య విషయము ఏమిటంటే మ్యజిక్, మామూలు వస్తువులను పక్క పక్కను చూపించడము. కథల లో పత్రలన్ని మ్యజిక్ పరిసరాల్లో సాధారణ జీవితాలు సాధారణ సమస్యలతో గడుపుతారు.

ఎలా మొదలైందంటే

Picture
                                  1990 లో జె.కె.రౌలింగ్ ఒక రష్ గా ఉన్న ట్రైను లో మాంచెష్టర్ నుండి ఇంగ్లండు కు వెళుతుండగా హ్యారీ పాటర్ ఐడియా అమె బుర్ర లోకి నడుచుకుంటూ వచ్చింది. ఒక చిత్తు కాగితము పై ఆ ఐడియా లు వ్రాసుకున్నారు. రౌలింగ్ ఆమె వెబ్ సైటు లో ఇలా అంటారు.


"ఆరు సంవత్సరముల వయస్సు ఉన్నపటి నుండి రచనలు చేస్తున్నా ఒక ఐడియా గురించి ఎప్పుడూ ఇంత ఉత్సాహము రాలేదు.[...] ఒక నాలుగు గంటలు (ట్రైను కోసము వైట్ చేస్తూ) ఆలోచిస్తుండగా, మెడడు లో వివరాలు రూపు దిద్దుకున్నాయి. ఈ సన్నటి, నల్ల జుత్తు గల (పాశ్చాత్య దేశాల లో నల్ల జుత్తు చాలా మందికి ఉండదు.) , కళ్ళజోడు ఉన్న బాలుడు, తాను నిజంగా మంత్రగాడనే విషయము తెలెయని వాడు, సాధ్యమని నాకు అనిపించడము మొదలు పెట్టింది.".[7]

ఆ రోజు సాయంత్రము ఆమె మొదటి నవల మమూనా, అనుకున్న ఏడు పుస్తకాల పాక్షిక వివరాలతో ఒక ప్లాన్, హ్యారీ పాటర్ పుస్తకాల లో పాత్రలు, మంత్ర ప్రపంచము లో చాలా మొత్తములో చారిత్రిక , మనిషి చరిత్ర సంబంధము గల(బయోగ్రాఫికల్) వివరాలు వ్రాయడము మొదలు పెట్టారు. [8]

అ తరువాత ఆరు సంవత్సరముల కాలము లో మొదటి బిడ్డ పుట్టడము, మొదటి భర్త నుండి విడాకులు పొందడము , పోర్చుగల్ కు నివాసము మార్చుకోవడము జరిగాయి. వీటన్నటి మధ్యలో ఆమె ఫిలాసఫర్స్ స్టోన్ వ్రాస్తున్నరు.[9] ఆ తరువాత ఎడింబరో లో స్థిరపడిన రౌలింగు కాఫీక్లబ్ లో చాలామటుకు కూర్చుని ఫిలాసఫర్స్ స్టోన్ వ్రాశారు. మంచి నర్సరీ(బాలల కేంద్రము) దొరక్క పోవడముతో ఆమె కూతురు కూడా ఆమె తో నే ఉండేది.

1996 లో హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ పూర్తి అయినది. మొదటి ప్రతి (మాన్యుస్క్రిప్టు) ఏజంట్లకు పంపడము జరిగింది. ఆమె ప్రయత్నించిన రెండవ ఏజంటు క్రిష్టోఫర్ లిటిల్, అమెకు సారధ్యము వహించడానికి ఒప్పుకుని బ్లూమ్స్ బెర్రీ కు ఆమె ప్రతిని పంపారు. ఎనిమిది మంది ప్రకాశకులు (పబ్లిషర్సు) నిరాకరించిన తరువాత, ఫిలాసఫర్స్ స్టోన్ ముద్రణ కొరకు బ్లూమ్స్ బెర్రీ అడ్వాన్సుగా £3,000 రౌలింగు ఇచ్చింది.[10]

వ్రాస్తున్నప్పుడు ఆమె బుర్ర లో పాఠకుల వయోపరిమితి దృష్టి లో లేదని రౌలింగు చెప్పినప్పటికీ, పబ్లిష్ర్స్ మాత్రము 9-11 వయస్సు గల పిల్లలను దృష్టి లో ఉంచుకుని ముద్రించారు.[11]. ముద్రణ సమయము లో, జోఆన్ రౌలింగు ను ఒక లింగభేదము తెలియని కలము పేరు (జోఆన్ అంటే అమ్మాయి అని అందరికీ తెలుసు మరి) పెట్టుకోమని కోరగా (9-11 సంవత్సరముల బాలురు,ఒక స్త్రీ చేత రచించబడిన పుస్తకాలు చదవరు అనే ఒక అపోహ తో ) ఆమె పేరును జోఆన్ రౌలింగు నుండి జె.కె. రౌలింగ్ గా మార్చుకున్నారు.[12]

జూలై 1997 లో మొదటి హ్యారీ పాటర్ పుస్తకము యునైటెడ్ కింగ్డమ్ లో బ్లూమ్స్ బెర్రీ ద్వారా ప్రచురించబడింది. ఆ తరువాత జె.కె. రౌలిఓగు కు ఆరు అంకెలు (డాలర్ల లో లెక్క వేస్తే ఏడు) అంకెల పారితోషికము ఆందిన తరువాత స్కాలష్టిక్ ప్రెస్, సెప్టెంబరు 1998 లో అమెరికా లో ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

ఒక దశాబ్దమ పాటు హ్యారీ పాటర్, మంచి రివ్యూల వలన విజయము సాధించింది. ఇందులో పబ్లిషర్స్ మార్క్టంగు కొంత కాగా, సాధారణ పాఠకుల నోటి మాట ప్రచారము(ముఖ్యముగా యువకులలో) కూడా భాగమే. యువకులు ఇంటర్నెట్, వీడియో గేమ్స్ పై మక్కువ చూపే కాలము లో పుస్తక పఠనము పై ఇంటరెస్టు తగ్గింది. పబ్లిషర్స్ మొదటి మూడు పుస్తకాలను వెంట వెంటనే విడుదల చేసి రౌలింగ్ పాఠకులలో ఉత్సాహము తగ్గకొండా చూసుకున్నారు.[13]. ఈ సీరీస్ పిల్లలనే కూడా పెద్దలను కూడా ఆకట్టు కోవడము తో హ్యారీ పాటర్ పుస్తకాలను రెండు ముఖ చిత్రాల తో విడుదల చెయ్యడము జరిగింది.(చిన్న పిల్లల కోసము ఒక రకమైన బొమ్మ,పెద్దల కోసము ఇంకొకటి).[14]. అనేక భాషల లో కి అనువదించబడడము వలన కూడా ఈ సీరీస్ కు పాప్యులారిటీ పెరిగి పోయింది. ఉదాహరణకు ఫ్రాన్స్ లో అత్యంత అమ్మకాలుగల మొట్టమొదట అమ్మబడిన ఇంగ్లీషు పుస్తకముగా Harry Potter and the Order of the Phoenix' ఖ్యాతి గడించింది. [14]

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది. [మార్చు] కథ [మార్చు] కథా వస్తువు(ప్లాట్/Plot) క్లుప్తంగా మామూలుగా రహస్యంగా ఉండే [మంత్ర ప్రపంచము], చాలా సంవత్సరములు లార్డ్ వోల్డమోర్ట్ తో భయపెట్టబడి ఉండి, మొదట సారి జరుపుకునే సంబరాలతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి వోల్డమోర్ట్ , దాక్కున్న హ్యారీ పాటర్ స్థావరానీ కనుక్కుని హ్యారీ తల్లిదండ్రులైన లిల్లీ, జేమ్స్ పాటర్ లను సంహరిస్తాడు. ఆ తరువాత వాడు మంత్ర దండమును పసి హ్యారీ పై ప్రయోగించినప్పుడు, చావు మంత్రము తిరగ గొట్ట బడుతుంది. వోల్డమోర్ట్ శరీరము నశించి, ఒక బలహీనమైన ఆత్మగా మారి, ప్రపంచము లో ఎవ్వరూ లేని ప్రదేశాలలో శరణు కోరడము మొదలెడతాడు. హ్యారీ నుదిటి మీద వోల్డమోర్ట్ శాపానికి ప్రతిబింబముగా మెరుపు లాంటి చార మటుకు మిగిలిపోతుంది. వోల్డమోర్ట్ ఓటమితో మంత్ర ప్రపంచములో 'బ్రతికిన బాలుడు' గా హ్యారీ పేరు పొందుతాడు.

అనాథ అయిన హ్యారీని క్రూరమైన, మంత్రగాళ్ళు గాని , హ్యారీ మంత్ర శక్తి వారసత్వము తో పరిచయము లేని, హ్యారీ భవిష్యత్తు పై అవగాహన లేని, చుట్టాలు డర్స్లీ కుటుంబము తో పెరుగుతాడు. పదకొండవ పుట్టినరోజు దగ్గర పడేసరికి, హాగ్వార్ట్స్ మంత్ర తంత్రజాల పాఠశాల నుండి హ్యారీకి ఆహ్వానములు వస్తాయి. వాటిని హ్యారీ పిన్ని హ్యారీకి అందకుండా చింపి వేస్తూ ఉంటుంది. పదకొందవ పుట్టిన రోజు మటుకు హాగ్వార్ట్స్ లో ఆటల నిర్వాహకుడైన హాగ్రీడ్, హ్యారీ ఇంటికి వచ్చి, హాగ్వార్ట్స్ కు హాజరు కావలసింది గా హ్యారీ ని పిలుస్తాడు. ఒకొక్క పుస్తకము, హ్యారీ హాగ్వార్ట్స్ జీవితము లోని ఒకొక్క సంవత్సరమూ, వాడు అక్కడ మేజిక్ ను వాడడము ఎలా నేర్చుకున్నాడు?, మేజిక్ వస్తువులని ఎలా వాడాడు?, మేజిక్ కషాయాల తో ఏమేమి చేశాడు? అని వివరిస్తుంది. హ్యారీ అక్కడ యుక్త వయస్సుకు చేరుతున్న కొద్దీ మేజిక్ సంబంధించిన,సామాజిక, ఎమోషనల్ ఇబ్బందులను అధిగమించడము నేర్చుకుంటూ ఉంటాడు. వోల్డమోర్ట్ కూడా ఇంతలో బలము సంపాదించుకుంటాడు.

హ్యారీ పాటర్ పుస్తకాలు

Picture
                                             హ్యారీ పాటర్ పుస్తకాలు ఇంగ్లండుకు చెందిన రచయత్రి జె.కె. రౌలింగ్ రచించిన ఫాంటసీ సాహిత్యపు పుస్తకాల వరుస. 1997 లో మొదటి పుస్తకము హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ (Harry Potter and the Philosopher's Stone) విడుదల నుండి, ఆ పుస్తకాల పాప్యులారిటీ ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగి పోయింది. హ్యారీ పాటర్ సినీమాలు, వీడియో గేమ్స్ ఇతర వస్తువులకు శ్రీకారము చుట్టడము జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఆరు పుస్తకాలు కలిపి సుమారు 30 కోట్ల కాపీలు అమ్ముడుపోయి ఉంటాయని ఆంచనా[1][2]. 63 భాషలలోకి కూడా అనువాదము చెయ్యబడ్డాయి.[3]

కథలో చాలా భాగము హాగ్వార్ట్స్ మంత్ర తంత్ర జాల పాఠశాల లో నడుస్తంది. బాలుడైన హ్యారీ పాటర్ కు క్షుద్రవిద్యలు నేర్చిన మంత్రగాడు వోల్డమోర్ట్ తో జరిగిన పోరాటము ఈ కథలో ముఖ్యాంశము. రౌలింగ్ అనుకున్న ఏడు పుస్తకాల లో అరు ప్రచురించబడ్డాయి. ఏడవది హ్యారీ పాటర్ ఆండ్ డెత్లీ హాలోస్ (Harry Potter and the Deathly Hallows) 21 జూలై 2007 న విడుదలై సంచలనం సృష్తించింది. విడుదలైన రోజే కాపీలన్నీ అమ్ముడైపోయి రికార్డులకెక్కింది. [4]


ఈ నవలల సాఫల్యము వలన, రౌలింగ్ సాహిత్య చరిత్ర లోనే అతి ధనవంతురాలైనది.[5]

మొదటి నాలుగు పుస్తకాలు సక్సెస్ ఫుల్ చలనచిత్రాలుగా వార్నర్ బ్రదర్స్ వలన మలచబడ్డాయి. ఐదవది హ్యారీ పాటర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్ (Harry Potter and the Order of the Phoenix) ఫిబ్రవరి 2006 లో షూటింగు ప్రారంభమైనది. 13 జూలై 2007 న విడుదలైంది.[6]