- స్వామీ వివేకానంద
- మాయా ప్రపంచము
- Creation
- Games
- optical-illusions
- Education
- Jokes
- Quotations
- Motivational Quotations
- Space
- Cars_Bikes
- పొడుపు కథలు
- సామెతలు
- జనరల్ నాలెడ్జ్
- వేమన పద్యాలు
- సుమతీ శతకము - బద్దెన
- కృష్ణ శతకము - నృసింహకవి
- చాటు పద్యములు
- దాశరధీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)
- నరసింహ శతకము - శేషప్పకవి
- నారాయణ శతకము - బమ్మెర పోతన
- భాస్కర శతకము - మారవి వెంకయ్య
- శ్రీకాళహస్తి శతకము
- శ్రీకాళహస్తీశ్వర శతకము - ధూర్జటి
శ్రీకాళహస్తి శతకము
* అతులితకాలకూట విషమప్పుడు మూడుకోట్లదే
వతలు ననేక బాధపడివచ్చి భయంబున నోహో పార్వతీ
పతియని నీవుదిక్కుయని పక్షులు వోలెను తల్లడింపుచుం
గతిచెడి వస్తె యందరినిగాచి విషంబు హరించినావు స
మ్మతముగ కాళహస్తి సురవందిత సాంబశివా మహాప్రభో !!
* అమరగణార్చితా తమకు నాశ్రితులైన యనేక భక్తులన్
శ్రమలెడబాసి ఘల్లున భృశంబుగ గజ్జెల మ్రోతబుట్టగా
భ్రమమున నందివాహనముపైన నిలంబడి భక్తులిండ్లకున్
ధిమిధిమి నాట్యమాడుచును దీనుల బ్రోవవె మోక్షమిచ్చి సం
భ్రమముగ కాళహస్తి నిటలాక్షుడ సాంబశివ మహాప్రభో !!
* అరమరలేక నేను శివరాత్రి మహోత్సవ కాలమందు జా
గరణము చేసి గొప్ప గన ఖండము బెట్టుక మేలుకొంటి హా
మరిపదమూడు జాములును మౌనుల మంచును నిద్రహారము
ల్మరచి తదేకధ్యానమున మర్వక మిమ్ముభజింప జేయుమీ
తిరిగిరి కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో !!
ఆ (0)
ఇ (1)
* ఇక్షుసుధాంఘ్రి యీశ్వరుడ యెన్నడు మిమ్ముల జూడమయ్య ప్ర
త్యక్షము జేసికోవలసి లెప్పునమానస పూజచేత ఫా
లాక్షుడ ముక్తికాంతను పలాలన జేసిసుఖించితే మహా
మోక్షముగద్దు భక్తిలకు మూలము నీవే మహానుభావ శ్రీ
లక్షణ కాళహస్తి మహారుద్రుడ సాంబశివ మహాప్రభో !!
ఈ (1)
* ఈశ్వర శంభుమూర్తి జగదీశ్వర కావవె యప్రమేయ కా
మేశ్వర సాంబమూర్తి పరమేశ్వర శాంతదయాబ్ధిదేవ నం
దీశ్వర లింగమూర్తి వసుధేశ్వర భక్తసుధామయర్ధ నా
రీశ్వర కాళహస్తి వృషభేశ్వర సాంబశివ మహాప్రభో !!
ఉ (0)
ఊ (0)
ఋ (0)
ౠ (0)
ఎ (3)
* ఎక్కడి చుట్టపక్కములు? నెక్కడిపుత్రులు? తల్లిదండ్రులున్
ఎక్కడి సంతపట్టునది? యెక్కడనైన ఫలించియుండెనా?
ఎక్కడ దేశదేశములు నండజముల్దత? ప్రొద్దుగ్రుంకితే
ఎక్కడి పక్షులక్కడనె: యెవ్వరిబాటలు వారివారికే
నిక్కము; కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో!
* ఎట్టిఘటంబు లుండినది యెందుకు నెక్కడ నే స్తలాననో
పుట్టినచోటనో, బ్రతుకఁ బోయినచోటనొ, యున్నచోటనో
గుట్టనొ, త్రోవనో, గుహనొ, గుంటనొ చావునిజంబు బొందికిన్
గట్టిగ కాళహస్తి గణనాయక: సాంబశివా మహాప్రభో!
* ఎన్ని మహాస్తలంబులని యెక్కడ చూడను? చూచునే భవ
ద్ధ్యాన్నము సేయ కెన్నటికిఁ దైవము నెక్కడ? తాను వేదసం
పన్న గుణాఢ్యుఁడై తన తపస్సు ఫలించితె యున్నచోటనే
యున్నది మోహనామృతము: వూరకె భూమిఁ జరింపఁగానె యే
మున్నది? కాళహస్తి మునివందిత; సాంబశివా మహాప్రభో!
ఏ (1)
* ఏమిఘటంబు? యేమిబ్రతు? కేమిశరీరము? యేమిదేహమున్?
ఏమిసుఖంబు? యేమియిది? యెన్నటికైనను చావుసిద్ద: మీ
భూమిని యిట్టిజన్మములు పుట్టినఁ గిట్టినఁ మోక్షమేమి? నా
సామి; కధాసుధామృత రసజ్ఞతఁ జెందిన ముక్తిగల్గునే
భూమిక: కాళహస్తి జగదీశ్వర: సాంబశివా మహాప్రభో!
ఐ (0)
ఒ (1)
* ఒక్కఁడె లోకరక్షకుఁడు; ఒక్కఁడె దైవము యెందుఁ జూచినన్
మిక్కుటమైన రూపములు మింటికి మంటికి సూత్రధారుఁడై
తక్కి సమస్తలోకములఁ దాండవ మాడుచు నున్నవాఁడు తా
నొక్కఁడె గాక; యీశ్వరుఁడు, ఒక్కని మించి యిత: పరుండు నిం
కెక్కడ? కాళహస్తి గిరిజేశ్వర; సాంబశివా మహాప్రభో!
ఓ (0)
ఔ (0)
అం (1)
* అంగజవైరి భక్తహృదయాంబుజ భృంగ కురంగపాణి శు
భ్రాంగశుభాంగలింగ భవభంగ ప్రసంగ దయంతరంగ మా
తంగభుజంగ పుంగవసితాంగ లతంగవ ముక్తికామ భ
స్మాంగవిభూషితాంగ వృషసంగకృపాతి మిరంగభంగ స
ర్వంగమ కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో !!
అః (0)
క (8)
* కమలవుబాళికిన్ హరికి గట్టిగ స్నేహమటంచు నందు; రా
కమలము లేడనైన నుదకంబులు లేనిస్థలంబునుండునా?
కమలసఖోగ్రతిగ్మఖర కాంతులకు న్మరి తాలరాదె? యా
కమలము వాడిపోక యుదకంబులు పాసినఁ జావదా? భవ
త్కమలము కాళహస్తి కరకంఠుడ; సాంబశివా మహాప్రభో!
* కరివరదాంఘ్రజానగ హితాత్మదారువనంగనామణీ
తరుణులబాసి యుగ్రజపతర్పణ హోమమునిల్పి ప్రోడయా
తురతనుమించి యీడిగె వధూమణితొ జని కల్లుకుండలో
జొరబడి యూపిరాడకయు సూరనినీవెత పించితంతగా
విరహమటయ్యా కంచి పృధివీశ్వర సాంబశివా మహాప్రభో !!
* కలగని మేలుకొన్న గతిగౌరవమాయ ప్రపంచకములో
కలసిన సమస్త భాగ్యములు గల్గిననేమి ఫలంబు సంపద
ల్నిలువవు దేహమోహములు నీరు మలంబుల మష్టుగుంటలో
మొలచిననీరుబుగ్గయిది మోసముజేసును నంమరాదు ని
శ్చలముగ కాళహస్తి నిటలాక్షుడ సాంబశివా మహాప్రభో !!
* కాలముదప్పకుండ దశకంధర బంధురవందిత త్రిశూ
లాలనుబూజచేసి నిటలాక్షుడయేను భజింతునయ్యయే
మూలవిరాట్టు సద్గుణుడ ముద్దులతండ్రి శశాంకమౌళి నా
పాలిటి లింగమూర్తి విరూపాక్షుడ దైత్యమదాపహార భూ
పాలక కాళహస్తి మహారుద్రుడ సాంబశివ మహాప్రభో !!
* కాశికిఁ బోవనేల? యుదకంబులు మోసుకురానదేల? నా
కాశి మహాప్రవాహజల కాలువలై ప్రవహించు తోయ మా
కాశిజలంబు గాదె? శివకాశిభవుండవు నీవె కావె? యా
కాశికి బోవ నా సకల కర్మము లన్నెడఁబాసి పోనె? భూ
తేశుఁడ: కాళహస్తి భువనేశ్వర: సాంబశివా మహాప్రభో!
* కాశీపురీశగర్భనవ ఖండధరిత్రి పతిత్వమబ్బెనా
యాశకుమట్టు లేదు కనకాద్రి సమానధనంబు గల్గినా
లేశమువెంట రాదు మదికింపుగ చేసినపుణ్యము
ల్దోలినబోదునీ కరుణతోయజ ముల్వికసించినంతట
న్బాసును కాళహస్తి కరకంఠుడ సాంబశివా మహాప్రభో !!
* కుంభిని సర్వదేవతలు కోరిన యేమిఫలంబు వారికిన్
శంభుడెతల్లితండ్రి గురు శంభుడెదిక్కు జగత్తుకెల్ల నా
శంభుడెరక్షకాత్మయని సంతతమున్ స్మరియింతు నే జయ
స్తంభములేసి సాటెదను సాహస కార్య పరాక్రమ క్రమో
జృంభణ కాళహస్తి శశిశేఖర సాంబశివ మహాప్రభో !!
* కొడుకులు లేకలేక యొక కోకిలవాణి సుపుత్రుమారుగా
నుడుతను దెచ్చి పెంచుకొని యుగ్రుని పేరిటఁ బిల్చి రార యో
కొడుకని ముద్దులాఁడగను గొమ్మకు నప్పుడు గర్భచిహ్నలై
కడుపు ఫలించె సంపదలు కన్నులఁ జూపె సమస్త కర్మముల్
విడిచెను గాళహస్తి వృషభేశ్వర; సాంబశివా మహాప్రభో!
ఖ (0)
గ (3)
* గరళముమ్రింగి కంఠముననిల్పి హరించిజయంచి దూయగా
సురనుతనీవు మూర్చగొనిస్రుక్కెను యాపదమూడుజాములున్
సురముని భూతసిద్ధయతి సూర్యసుధంశువువువేంద్ర యింద్రగం
ధర్వులు భక్తి చేత తమదాపున జేరుక సేవచేయుచున్
తిరిగిరి కాళహస్తీ త్రిపురాంతక సాంబశివా మహాప్రభో !!
* గాయక: రావణాసురుని కన్న ధనాఢ్యులు లేరు: భూమిలో
మాయలయందు, సర్వఘన మంత్రములందును, ధైర్యమందునున్,
బ్రాయమునందున్, బలపరాక్రమమందును, భక్తియందునున్,
గాయమునందుఁ గా తుదకుఁ గాలము చెల్లిన యంతనే హతుం
డాయెను: గాళహస్తి యమరాచిత: సాంబశివా మహాప్రభో!
* గోత్ర కళత్ర మిత్ర మదగోధ్వజ గాత్ర శరీరదాన గో
త్పాత్ర ప్రతిష్ట ప్రాణపరిపాలక సద్గుణ దేవరత్న గా
యత్రి సుతాంఘ్రి భక్తుల యేమి ప్రధానము కేవలం శివ
స్తోత్రము జీవననౌషధము జిహ్వకు కర్మవిమోచనంబయా
క్షేత్రము కాళహస్తి శశిశేఖర సాంబశివ మహాప్రభో !!
ఘ (0)
ఙ (0)
చ (0)
ఛ (0)
జ (4)
* జలధర లోకరక్షకుఁడు, సర్వము రుద్రమయం జగత్తుగాఁ
బలికిన వేదశాస్త్రములఁ జేరఁ జెలంగె: మదాంధులై మహా
త్ములు పతనంబుచేత శివదూషణ చేసి యనేక యేండ్లు బా
ధలఁ బడి నోరు పుచ్చి సిరి దప్పియు ఘోరపు దుఃఖజీవులై
నిలచిరి, కాళహస్తి నిటలాక్షుఁడ: సాంబశివా మహాప్రభో!
* జలధర: నీవుమాకు సిరిసంపదలిచ్చిన మేలువార్తగాఁ
గలగని, మేలుకొన్నయటు గాక; మహేశ్వర: యేది వేళ నీ
కొలువున నుండి యన్యులను గోరి వచింపను నోరు రాదయా
వలితఫణీంద్ర! నారి: నిటలాక్ష: సదాశివ: శంభుమూర్తి: కే
వలమును గాళహస్తి కరకంఠుఁడ సాంబశివా మహాప్రభో!
* జీవుఁడు జీవుఁడంచును భజించిన, నాత్మకునాత్మ దేవుఁడే
జీవుఁడు జీవుఁడే గురుఁడు జీవుఁడు దేవుఁడు దేవదేవ నీ
త్రోవను నీవు పోవఁ బెడత్రోవకు బొందికి యాత్రగల్గు: ని
ర్జీవ ఘటంబుశ్రీఘ్రముగఁ జేరువగాఁ బడి రుద్రభూమికిన్
జీవము; కాళహస్తి గిరిజాపతి; సాంబశివా మహాప్రభో!
* జీవుఁడు వచ్చిపోవు క్రియ చిక్కఁగ నీయక చచ్చిపుట్ట, నీ
లాగున నిట్టిజన్మములు లక్షలు కోట్లన, నిందు నందు నా
దేవుడ: యేమిసార్ధకము? మానసమందున నిన్ను నమ్మినన్
కేవలమున్ను మోక్షపురి కెత్తుకపోయి తరింపఁ జేతు వో
ధీరుఁడ: కాళహస్తి జగదీశ్వర; సాంబశివా మహాప్రభో!
ఝ (0)
ఞ (0)
ట (0)
ఠ (0)
డ (0)
ఢ (0)
ణ (0)
త (5)
* తత్తర నన్నుఁ గన్న తలిదండ్రులు యెత్తుక ముద్దులాడి నీ
పొత్తున డించి యీశ్వరుఁడు పోషణఁ జేయు నటంచు గట్టిగాఁ
దత్తము చేసినారు; గురుదైవము నిద్దరు నాకు నీవె సా
క్షాత్తు నిజస్వరూపమును కన్నులఁ జూపుము కాంక్ష దీరఁగాఁ
రక్షక; కాళహస్తి బుధరంజక సాంబశివా మహాప్రభో!
* తమ నేత్రద్యుతి దామెచూడ సుఖమై దాదాత్మ్యమున్గూర్ప గా
విమలమ్ముల్కదు లాభముల్జిత లసద్విద్యుల్లతా లాస్యముల్
సుమనో బాణ జయప్రదమ్ములనుచున్ చూచున్ జనంబూని హ
రి మృగాక్షి నివహమ్ము కన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా !
* తాండవలింగ; నీమతి వితండము లేమొ? యనాథలోభి పా
షండుల కీవు భాగ్యమును సంపద లిత్తువు; సత్య సద్గుణో
ద్దండ నిధాన మంత్ర జప తత్త్వ ప్రసంగ తప: ప్రభూత స
త్పండితులైనవారికి విపత్తుల విత్తు: వదేమి? వారికా
దండన? కాళహస్తిపుర ధారణ; సాంబశివా మహాప్రభో!
* తారకపుత్రదార తల్లిదండ్రులు నన్నలు తమ్ములున్ చెలు
ల్బావలుచుట్టముల్ సఖులు బంధువు లెవ్వరు వెంటరారు యీ
జీవముకాస్తబోతెమరి జేరరు దగ్గిర నెంత ప్రాణసం
జీవప్రియాప్తులైన హరిషించరు శీఘ్రము పట్టమందురో
దేవుడ కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో !!
* తెలివిగ నున్నవాఁడె యుపదేశముఁ బొంది శివా: శివా: యనున్
పలుకులు సంగ్రహించుకొని భావము నందున ముక్తికాంతతో
గలిసి సుఖింపలేక నరకంబునఁ పాపపుఁ గల్మశంబులో
బలిమిగ దూరిపోయి యమబాధల కోపిరి కష్టజీవులై
దెలియక కాళహస్తి బుధ శంకర; సాంబశివా మహాప్రభో!
థ (0)
ద (4)
* దక్షిణకాశిగంగ యరుదైన సువర్ణముఖీ మహానదిన్
యక్షుసుధారసాభ్ధియని యక్షులు తుంబుర నారదాదులున్
దక్షులెయైరి సిద్ధులు కృత్థారులు నైన మహాస్థళంబు పం
చాక్షరిమంత్రపురిత రసామృతపాత్రుల దివ్యక్షేత్రమో
దక్షిణ కాళహస్తీధరణీశ్వర సాంబశివా మహాప్రభో !!
* దక్షిణకాశీముఖ్యనదీ దక్షిణస్వర్గము పుణ్యక్షేత్రమై
మోక్షములేని దీనులకు మోక్షములిచ్చి తరింపచేయ నీ
దక్షిణ కాశీకేవలము దగ్గ్రయున్నది చూస్తిమయ్యా ప్ర
త్యక్షము దేవలోకమని యేర్పడ నేటికి మల్లిపుట్టె
ఫాలాక్షుడ కాళహస్తి పరమాత్ముడ సాంబశివా మహాప్రభో !!
* దుర్గుణయాగశిక్ష సురధూర్జటిమంబుభిమందునీ స్తుతా
భర్గభనాధరాంతక ప్రభాకరపర్జయపర్ణ పార్వతీ
దుర్గమృడాణి చండికవధూమణి మానసపద్మ బంధరా
భార్గవశిస్యవర్గ హలభార్గ సాంబశివా మహాప్రభో !!
* దేవమహానుభావ జగదీశ్వర ధూర్జటి యీశ్వరామహా
దేవహరామృడానిజపదేవతా భర్గఫణీంద్రహారహా
రావళినీలోలహితపురాజిత బ్రహ్మకపాలహస్తయో
పావనమూర్తి సద్గురుడ పాలితమౌనిసురేంద్ర మోక్షబృం
దావనకాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో !!
ధ (2)
* ధరధర మేరుచాప ప్రమధాధిప రుద్రయువేంద్రతాడనా
గరళగళ త్రినేత్ర ఫణికంకణశంభకృశాను రేతయో
హరహరశూలపాణి హరిహంస తురంగమరత్న మౌళిని
ర్జనుత మూలబ్రహ్మదను జాంతకసాంభవిచిత్తచోర శ్రీ
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో !!
* ధాత్రి సమస్తభక్తులు కృతార్ధులు నైన మహాస్ఠలంబు యీ
క్షేత్ర మహత్వమేమియని చెప్పుదు మోక్షనదీగయా కురు
క్షేత్ర ప్రయాగదీప ౠషి సిద్ధులె పుట్టిన జన్మభూమి యీ
క్షేత్రము దివ్యక్షేత్రమున చాల ప్రసిద్ధము నమ్మి యీ మహా
క్షేత్రము కాళహస్తి శితికంఠుడ సాంబశివ మహాప్రభో !!
న (15)
* నంది తురంగ కుందర పినాక ప్రియంబక స్రష్టసారధీ
నందునుతాగ్ని భక్త శరణాగత పోష నమశ్శివాయయే
సుందరమూతిన్ ఖండ పరశూరజతాద్రి పతీ ధనంజయా
నందితనాగభూషణ భవానికళత్ర సుభక్తి సంగమా
నందము కాళహస్తి యజవందిత సాంబశివా మహాప్రభో !!
* నరసురవంద్యుఁ డీశ్వరుఁడు నాయకుఁ డొక్కడె గాని వేరిత:
పరము నెరుంగ మంధక విపక్ష: యటంచు సహస్ర శీరుషా
పురుష యటంచు దేవతలు పూజ యొనర్చి తరించినారు; నా
తరమె భవత్స్వరూపముల త్రాణ యెరింగి నుతింప నాత్మ సు
స్థిరముగఁ గాళహస్తి సురసేవిత; సాంబశివా మహాప్రభో!
* నాయెడ ప్రేమగల్గి శివనామసుధా మృత వేదపా
రాయణమాకు భోజనము రాజిత సద్గుణ నిత్య సత్యమే
యాయువుగా నదమంములు నక్షయమైన ధనంబుమాకు నా
దాయము రుద్రమూర్తి భవదంఘ్రిల నమ్మితి భక్తజీవనో
పాయము కాళహస్తి పరమాత్ముడ సాంబశివ మహాప్రభో !!
* నిండు దయాభ్దిమోక్షజిత నిండు ఘటాబ్ధి హిరణ్యశైల కో
దండ ధరిత్రిదాత భవదద్భుత నిర్మల యోగపురితా
తాండవ లింగ నా యెదుట దాండవనృత్త వినోదలీల ను
ద్దండముగుల్క జూడవలె దాతనుతాంఘ్రి ముకుంద మాధవా
మండిత కాళహస్తి మాహారుద్రుడ సాంబశివ మహాప్రభో !!
* నిండు సమస్తలోకముల నీలసుకంధర; రుద్రమూర్తికిన్
రెండవ సాటివేల్పు లిఁక లే రని వాకిట ఘంటగట్టి వే
దండము నెక్కి యంతటను దంధణ దంధణ భేరి వేసి బ్ర
హ్మాండము దండ నిండుకొని యద్భుతమైన మహాస్వరూపుఁడై
యుండవె? కాళహస్తి త్రిదశోన్నత: సాంబశివా మహాప్రభో!
* నిత్యము రుద్రమంత్ర జపనిష్ఠతపోబల మోక్షసిద్ధులై
సత్వగుణాభిరామ నిను సన్నుతిచేయ ననేక కోట్ల బ్రం
హత్యలు పారిపోను మదహస్తముఖోద్భవయేది హేళనీ
సౌఖ్యము సర్వమోక్ష సిరిసంపదలిచ్చును మాకు మందరా
కృత్యము కాళహస్తి మహారుద్రుడ సాంబశివ మహాప్రభో !!
* నిన్నుదలంతు నన్ను గరుణించు మటంచు దలంచి యాత్మలో
నెన్నటికైన ప్రాప్తమున యీశ్వర రూపము జూడగల్గునో
కన్నులగాంక్ష దీర కరకంఠుడ నామము శబ్ధ వాక్యము
ల్విన్న ఫలంబు గల్గునని వేదములెప్పుడు నార్భాటించుచు
న్నున్నవి కాళహస్తి వృషభేశ్వర సాంబశివ మహాప్రభో !!
* నిల్వవు ఎట్టి కాయములు నిల్వవు గోవులు మాయసంపద
ల్నిల్వవు భోగభాగ్యములు నిల్వవు సొమ్ములుయిండ్లుమేడలున్
నిల్వవు యూహబోహణలు నిల్వవు కష్టసుఖాలు యంశలున్
నిల్వవు మోహపాశములు నిల్వవు వాంఛలు పాడిపంటలున్
నిల్వవు కాళహస్తినిటలాక్షుడ సాంబశివా మహాప్రభో !!
* నీమము పట్టిరావణుఁడు నిత్యము భోజనకాలమందు హా
కోమలి సన్నుతాంగి: నవకోటి ననర్థుల పూజఁజేసి ర
క్షామణి యేమిమోక్షసిరి సంపద నొందితరించె, పైఁగ శ్రీ
రాములచేతఁ జచ్చెఁ; ద్రిపురాంతక: చూడుమి భక్తిలేక యీ
భూమిని, కాళహస్తి భువనేశ్వర: సాంబశివా మహాప్రభో!
* నీరజటాకలాప పరమేశ్వర నిన్ను నుతింప దేవబృం
దారకులైన జాలరు యధాస్ఠితిగా నినుగాంచి నిన్నుకై
వారమిచేసి సద్గురుడ వర్ణన సేయను నాతరంబెయే
మేరువశాఙ్ఞ్గన్ పాణి పరమేశ్వరపూరిత ధర్మసత్యసం
కారణ కాళహస్తి పరమేశ్వర సాంబశివ మహాప్రభో !!
* నీవె సమస్తరూపధరణీశ్వర మందలజ్యోతిరూపము
న్నీవె జగత్గురుప్రముఖ నిత్యమహోత్సవ శక్తి రూపము
న్నీవె పరంపరాత్ప్రముఖ నిగ్రహవిగ్రహమ్రతరూపము
న్నివె జయంజయాసుగుణనిర్గ విచార మహాస్వరూపము
నీవేగతిన్ని నన్మనుప నిక్కము సాంబశివా మహాప్రభో !!
* నెత్తిన గంగయుండ; శిఖినేత్రమునన్ దనిలుండునుండ నీ
యెత్తున ధాన్యముండ, మరియెత్తుగఁజేతను బాత్రయుండ, నీ
పొత్తునఁ గూడువండుకొని చోద్యముగా భుజియింపరాదె యీ
పిత్తమ దేమి? జోగివలె భిక్షకుఁ బోవఁగ నేమి? వట్టిదే
దిట్టవు కాళహస్తి నుతదిక్పతి సాంబశివా మహాప్రభో!
* నెరనిను నమ్మికొల్చునరు నేత్రసరోరుహ పూజితంఘ్ర నే
నిరతము మంత్రపుష్పముల నేటను రేపట నిన్ను చిత్తుగా
గురుతుగపుజచేసి యమద్వారము గట్టిగ పాడుచేతుగా
బిరుదుశరాయుజూడు వృషభేశ్వర భూరిజటాకలాపయే
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో !!
* నెరయ దరిద్రదోషమున నిత్యము జేసెఁడు పొట్టకోసమై
నరుల నుతించి మానుషము దప్పి, యసత్యము లాడలేక నీ
మరుగున జేరిరిక్తులము మమ్మును బ్రోవుమటంచు మ్రొక్కినన్
గరఁగదు నీమనంబు; శితికంధర; యింత పరాకదేలరా?
యెరిఁగియుఁ గాళహస్తి వృషభేశ్వర; సాంబశివా మహాప్రభో!
* నేశరణన్న వాని కరుణింతువు చక్కగ మెచ్చి యర్ధనారీ
శ్వర నిన్ను నిప్పుడెదిరించినవారి సమస్త లోకసం
కాసన పక్ష భీష్మ సోరకౌర దృఢాంచి వజ్ర దైత్య వ
జ్రాసి పితాపితామహుల చాటునబోయిన సంహరించవా
చూచితే కాళహస్తి శివసుందర సాంబశివ మహాప్రభో !!
ప (20)
* పండితపామరుల్సకల పాపవిమోచన దండదండనో
ద్దండభావండ మండిత పదాండన ఖండల మండలాద్రి కో
దండ ప్రచండపిండ భవదండలఖండిత కుండ పాండురా
పాండవ వీరరుద్ర పరిమండిత భార్గవ పాండవాగ్ని రు
ద్రాండజ కాళహస్తి మహారుద్రుడ సాంబశివ మహాప్రభో !!
* పన్నగభూషనీవు చేయిబట్టిన చాపము పైడికొండ నీ
వున్నదివెండికొండ తలవున్న తమంత హిరణ్యనీరి నీ
కన్న ధనాఢ్యులేరిజగతందున యేవగనెంచిజూచినన్
దిన్నగ భిక్షమెత్తుకొన దీనుడవా? దరిలేనివాడవా?
యెన్నగ కాళహస్తివృషభేశ్వర సాంబశివా మహాప్రభో !!
* పరమ సఖుండ భక్తసుకర వజ్రనుగ్రహజాగ్రదావస్థయున్
దొరకదు యింత కన్నను చతుర్దశలోకము లెంచి చూడ నీ
కరుణాకటాక్షవీక్షణము గట్టి గవుంచుమి నమ్మినాను శ్రీ
ధరనుత కాళహస్తి జగదీశ్వర సాంబశివ మహాప్రభో !!
* పరమరహశ్య మంత్రక్రియభాసురపక్వ ఫలామృతామృతా
ధరరుచిగొన్న భక్తగణ దీక్ష మహాత్ములపాదధుళి నా
శిరమునజేరి ఎన్నటికి సిద్దులమౌదు మొగాక నేను నీ
మరుగునజేరినాను యభిమానమునుంచి తరింపజేయవే
గురుతుగ కాళహస్తి గిరిజాధిప సాంబశివా మహాప్రభో !!
* పాండు కళాధురీణు డెడబాయక సర్వ జగత్కిరీటివై
డండడడాండడాండడడడాండ యటాంచు నుతింతు నిన్నునే
తండవమూర్తి సర్వభజతారక బ్రంహపిపీలికాది బ్రహ్మాడంము
నిండ నిండుకొని యద్భుతమైన మహాస్వరూపమై
యుండవే కాళహస్తి జగదీశ్వర సాంబశివ మహాప్రభో !!
* పిడికిట పుష్యరాగమణిఁ బెట్టుక వ్యర్థులు రాళ్ళకోసమై
యడవిఁ జరింపనేల? మిము నాత్మ నెఋంగక సంతజోగులై
పుడమిచరింపనేల? శివపూజక్రమంబులు లేకనశింపనేల? నా
కడపటఁ బొర్లనేల? యుదకంబులు లేక నశింపనేల? నా
గడములు: కాళహస్తి యజవందిత: సాంబశివా మహాప్రభో!
* పిత్తళి హేమమౌనె? యది యెన్నిపుటంబులు వేసి చూచినన్
ఇత్తడి యిత్తడేని; నిది యెక్కువ సొమ్ముకు నష్టి చేటు; నా
ఇత్తడి పైడియౌనె యిది యన్యమెరుంగక రిత్తవేల్పులన్
సత్తుగ పూజ చేసినను సద్గురు పాదము నమ్మకుండినా
ఉత్తది: కాళహస్తి వృషభేశ్వర: సాంబశివా మహాప్రభో!
* పుట్టుక యేడనో? సకల భూములఁ ద్రొక్కి చరించు టేడనో
పట్టణ మేడనో? యురల పానము లేడనో? మట్టియేడనో
గిట్టడ మేడనో? మరిసుఖించుట యేడనొ యుండుటేడనో
గట్టిగ నీ వెరుంగుదువు గాక: యితర్లకుఁ జెంది చిక్కునా?
వట్టిది కాళహస్తి పతిరుద్రుఁడ: సాంబశివా మహాప్రభో!
* పుడమిని భక్తిగల్గి శివపూజనుదామృతపూణన్ సద్భ్ధా
ముడివిడగోసి లోపలను మూలవిరాటుని మోక్షకన్యకా
కుడిభుజమెక్కి తాండవము గుల్కగ గాని యనేక పాపము
ల్విడుదలగావు కమన్ ములువీడవు యెంతటివారకైన రు
ద్రుడవిను కాళహస్తి మహారుద్రుడ సాంబశివ మహాప్రభో !!
* పురహర తొల్లి విష్ణువును చూడరె నేత్రంసరోరుహంబుతో
మురియుచుపుజచేసిమరి మోక్షములంది తరించి యిప్పుడున్
మరి మరి నోరుక్రొవ్వి శివమంత్రము నోట పఠించ కున్న యీ
నరులకు యేమోకాని వరనందన సత్కళ కాంతిలేక నే
జరిగిరి కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో !!
* పురహర శంభుమూర్తి శివపూజమహత్వము జూచియాత్మలో
పరుషముచేత మాయ గనునందెలుమువ్వలు నాడ జూచియో
వరగురు ధర్మ భిక్షయనివచ్చి నిలంబడి తొల్లి యాత్మలో
సరళిగమెచ్చి భక్తిగ ప్రసన్నమునై దరిజేర్పరా విరా
ట్పురుషుడ కాళహస్తి వృషభేశ్వర సాంబశివ మహాప్రభో !!
* పురహరకుంజరానను సుపుత్ర పవిత్రపితాపితామహా
వరదపరంపరాత్పరదివాకర సన్నిభ నాగ కుండలా
భరణ శశాంకబింబకలభాసిత విభ్రమ తారకా
పురజితభస్మ లేపనవసుంధర సన్నుత నీవేగాక
సద్గురుడవు కాళహస్తిపరమేశ్వర సాంబశివా మహాప్రభో !!
* పులివలె నాఘటంబు పడిపోయిన పిమ్మట గాలి గాలిలో
పలను ఋణానుబంధ ప్రతిబాధ్యత నున్నకళేబరంబులో
నిలుచు నటన్న స్వగృహము నీడను బాసినఁ జీఁకటింటిలో
నిలిచిన హంసకైన కని నీవు యెఋంగని మాయ యున్నదా
వెలుపలఁ గాళహస్తి యతివందిత; సాంబశివా మహాప్రభో!
* పేరుకు నన్నియాత్రలు ఫలించె ననంగను బుణ్యుఁడాయెనా?
కారము మానెనా? సకలకర్మ నివారణసిద్దుఁదాయెనా?
వూరకె పోయిరావడము వొక్కటె: యెందు సమస్త యాత్రలున్
దీరినఁ దీరకున్న గురుతీర్థ ప్రసాద ధురీణుఁడాయెనా?
శూరుడ: కాళహస్తి శివశోభన: సాంబశివా మహాప్రభో!
* పొదలెడి నాదరిద్రములు పోయెను మిమ్ములఁ జూడఁగా నిహన్
కుదిరెను మామనస్సు వృషఘోటక; భీష్మభవాంధకారముల్
వదలెను నేఁటితోను; మనవాంఛను వచ్చిన కాలకింకరుల్
ఒదిగిరి మూలమూల; నిఁక నూరకె శంభుని నామకీర్తనల్
చదివెదఁ; గాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో!
* ప్రాణము బొందిలో నిలిచి పాపముపుణ్యము చేసియా
ప్రాణము లేచిపోయి యమభాధలజెందితే బోందిపోయి యా
ప్రాణి సహాయమౌను భవ భంధ~ఋణాదులు దీరునంటెయా
ప్రాణము లేచిరాదు యుపకారము వొక్కటివచ్చుదోడుగ
ప్రాణికి కాళహస్తి పరమాత్ముడ సాంబశివా మహాప్రభో !!
* ప్రాణమునమ్మరాదు యికప్రాపుగ నమ్మి ఘటంబులోన నీ
ప్రాణములుండగానె నిను బ్రార్ధన చేసి నటింపరాదయా
ప్రాణమనిత్యమంత నరు ప్రాణము జూచిన బుద్ధివెంటనే
ప్రాణముగానరాదు వుపకారము వక్కటి వచ్చు తోడుగా
ప్రాణికి గాళహస్తి విరూపాక్షుడ సాంబశివ మహాప్రభో !!
* ప్రాణములుండగానె నిను ప్రార్ధనజేసి నటించరాదు నీ
ప్రాణములున్న మట్టుకు నిబంధనయున్నదొ ..... ట్టుకే
ప్రాణమునిల్వ దాకడను భాద్యతదీరితెయనకేలనీ
ప్రాణము లేనిబొందినిను ప్రార్ధనచేసున మళ్ళివచ్చునా
ప్రాణము కాళహస్తి పరమాత్ముడ సాంబశివ మహాప్రభో !!
* ప్రాణికి బొంది కేమిప్రతి భాద్యత యెప్పుడోయే క్షణానో
ప్రాణము భంగవెట్టి సురపత్ని పితామహుదుఃఖ వెట్టినా
ప్రాణము దల్లడిస్తు తనబాటను ఎక్కడో ఏస్థళానో
ప్రాణము వెళ్ళిపోతెతన భాద్యలంతట దీరిపోవునా
ప్రాణికి కాళహస్తి పరమాత్ముడ సాంబశివా మహాప్రభో !!
* ప్రేమతో నీవుగన్న యొక బిడ్డడు గుజ్జయికూటికేడ్చెనా
భామప్రియాత్మజుండన వివాహము లేక తపియించుచుండనీ
దూమసుతుండు పైకినొక దుప్పటి యిమ్మని యంగలార్చెనీ
కేమిపరాకొ పుత్రులకు నీవనివాడవు మాకు నిత్తువే
భూమిని కాళహస్తి ఫణిభూషణ సాంబశివా మహాప్రభో !!
ఫ (0)
బ (2)
* బట్టలు పిండి కట్టుకొని భక్తిగ సంధ్యల నెంత వార్చినన్
బట్టెఁడు చేతిలోన నొక భక్తుని కైన నతీతభిక్షముల్
పెట్టక ముక్తిలేదు: మును పేమియు నైనను పెట్టిపుట్టితే
పుట్టికి నూరుపుట్లు: శివపూజలు నూటికి కోటివేలు: నీ
దిట్టము కాళహస్తి భువనేశ్వర; సాంబశివా మహాప్రభో!
* బారుగ నాటలాడి శివభక్తులతొ సరియైన నీకు శృం
గారములేల దారువనకాంతలునేల భవానియేల భా
గీరధియేల సర్పభుజకీతులు నేల ధరించుకొన్నవె
వ్వేరుగయొక్క ముద్దుమురిపెంబుల నెవ్వరుజూడనయ్య మీ
వారిలొ కాళహస్తి సురవందిత సాంబశివా మహాప్రభో !!
భ (4)
* భాసురపంచ వక్త్ర యొక భక్తుడు యెంగిలిపండ్లు గిన్నెలో
తీసుకవచ్చి వెట్టినను దిగ్గునలేచి భుజించి మెచ్చి కై
లాసము యిచ్చినావు కరకంఠుడనీ భ్రమ యేమి చెప్పనో వా
సవపూజితాంఘ్రి ముని వందిత మమ్ముల బ్రోవవయ్య నీ
దాసుడ కాళహస్తి నిటలాక్షుడ సాంబశివా మహాప్రభో !!
* భీమ మహేశ్వరాపిలువ పేరునునీవెధరిం కొందు నీ
భామకురాగిసొమ్ములన పారముగాధరియించినావుచి
న్నా మెకుజీరెయివ్వ కననాధనుగానొగి జేసీనావు నీ
కేమిదరిద్రమెందెన పకీతిన్ యెరుంగక చేసియట్టులీ
భూమిని కాళహస్తి సురపూజిత సాంబశివా మహాప్రభో !!
* భూతపతీకలవృషబావృత వక్ష సరోరుహాంఘ్రి సం
భూతసుతాగ్ని కేశశివపూజ మహత్యముభక్తవత్సలా
మాతపితాసహోదరులు మాకికయెవ్వరు మీకు మించవో
శ్వేతకళత్రపూర్ణశశిశేఖర యిక్కడ మాకును నివే సం
ఘాతము కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో !!
* భూమిననీ సువర్ణముఖి పుట్టెను రెండవ వారణాసియై
పామరబద్దపాశ భవపాపవిమోచన పుణ్యక్షేత్రమై
క్షేమమని చ్చుకర్మముల జెందియవస్థల గొట్టివేసు నీ
నామసుధారసామృతము నమ్మితిమమ్ములబ్రోవవయ్యా మీ
వ్రేమను కాళహస్తి మహారుద్రుడ సాంబశివా మహాప్రభో !!
మ (10)
* మంత్రముమంత్రమందురు సమస్త మునీంద్రులు సప్తకోటి యా
మంత్రములేల పామరులుమాయా జపాలకు చేయునట్టిది
తంత్రముగాదే భక్తులకు తారకమౌ శివనామ మంత్రమే
మంత్రముగాక నన్నియును మంత్రము లంచుజపించవచ్చునా
యంత్రము కాళహస్తి యతివందిత సాంబశివ మహాప్రభో !!
* మనుజులు నీన గర్భకసుమాలపు డొక్కలయందు మళ్ళి హా
ననుఁబడఁ ద్రోయవద్దు; యొకనాఁటికినైన మహాత్మ: యీపున
ర్జననము చాలు; సద్గతికిఁ జేర్చర: యీశ్వర: యేదివేల నే
నినునెఁడబాయకుందు; ధరణీశ్వర: యంచును మ్రొక్కుచుంటి నా
మనసునఁ; గాళహస్తి మహరుద్రుఁడ; సాంబశివా మహాప్రభో!
* మన్మధవైరి మాకు పరమామృత పానము సేయకున్న నా
జన్మమదేల సద్గురుని చెంతను జేరితదేక నిష్టతో
చిన్మయలింగమంత్రము ప్రసిద్ధిగ నోట పఠించితే పునః
జన్మములేదు భక్తులకు క్షేమము యింద్రుని సన్నిధానమే
జన్మము కాళహస్తి జగదీశ్వర సాంబశివ మహాప్రభో !!
* మాతపితాసు తాంఘ్రిశివమంత్రము నోట పఠించకున్న యా
నోరువృధా నిరర్ధకము నోరన రాదది పాడుబొంద ఓం
కారమహత్వభక్త సిరికాంచన బ్రహ్మకపాలహస్త ఓం
కారవిభూతిదాయక సుగంధరగంధ శరీరదేహ కం
ఠీరవ కాళహస్తి కరకంఠుడ సాంబశివా మహాప్రభో !!
* మానకబోయడెన్నడు సమస్తమృగముల జంపి దొన్నెతో
మాంసముదెచ్చి వెట్టితిను మంటెభుజిస్తివి యొగ్గులేకనీ
తాపమదేమొనీవు యిక దగ్గిరరాకు మటంచు పార్వతీ
హింసలనిన్ను బెట్టితె సహిస్తివి యప్పుడు శాంతమూర్తివై
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో !!
* మానవజన్మమెత్తి శివ మంత్రలసద్గతి ముక్తిసత్క్రియా
హీనుడుయెన్ని విద్యలు గ్రహించిన నేమిఫలంబు యీశ్వర
ధ్యానముచేసి మోక్షమునుగనొననెప్పుడు సంచరించుటయే
మానవుడైనగాని శివమందిరమందు నటించనేర్చునా
మానవ కాళహస్తి మహారుద్రుడ సాంబశివా మహాప్రభో !!
* ముట్టునఁ బుట్టి, రక్త, మల మూత్రములందున దోషకారినై
పుట్టిన నెన్నిజన్మములు భూమిని మళ్ళి, యనేక చోట్ల నేఁ
బుట్టిన నేమికద్దు? నరపుట్టుక నా కిఁక వద్దు: నన్ను నీ
పట్టున నిల్పి, మోక్షక్రియ మార్గముఁ జూపి, తరింపనీఁ
గట్టిగఁ గాళహస్తి గణనాయక; సాంబశివా మహాప్రభో!
* ముప్పునఁ గాలకింకరులు ముంగిటఁ జేరుక కాలపాశముల్
తెప్పునఁ గట్టి ప్రాణములు తీసెడు వేళల, మాయచీఁకటిన్
గప్పిన నాఁడు మీస్మరణ కల్గునొ? కల్గదో? యందు కిప్పుడే
తప్పక జేతు మీస్మరణ త్ర్యంబక; నేను దరించుకోసమై
యప్పని కాళహస్తి నిటలాక్షుఁడ; సాంబశివా మహాప్రభో!
* మూలము విశ్వకర్మకుల భూషణ భద్రయపుత్రరత్న బా
ణాలసవంశ దీపక సనాతన గోత్రప్రశ స్తభూప్రతీ
పాలకుడైన వీరశరభేంద్ర కవీంద్రుడు నిత్యకోటి లిం
గాలను బూజచేసి శతకంబురచియించె గ్రహించవయ్య నా
పాలిటి కాళహస్తి పరమాత్ముడ సాంబశివా మహాప్రభో !!
* మేలుగ నాదమూర్తి పరమేశ్వర నామసుధారసంబు నా
నాలుకమీద యెన్నటికి నాట్యము గల్గునో నాదుజన్మ జ
న్మలతరింపు చుందునని మానసమందు నుతింతు భక్తవా
చాలకమైన రుద్రుని ప్రసంగము నెప్పుడు నోటనూరితే
చాలును కాళహస్తి సకలేశ్వర సాంబశివ మహాప్రభో !!
య (1)
* యెరుగక జేసినపాపములు యెంతతపించిన వ్యధన్ బోవునా
వరయమధర్మరాజు పరిపాలన నాటికివచ్చు నీ మహా
గరువ మధాంధకారమున కానక చేసిన పుణ్యపాపముల్
తరుముక వచ్చువెంటబడి తప్పక యెక్కడదాగియున్ననో
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివ మహాప్రభో !!
ర (1)
* రక్తకళత్ర యీశ్వరుడ రజితనామ గిరీశవైభవా
భక్తులు తొల్లొ యిక్కడ తరించెదమంచును వచ్చి యాత్మలో
రక్తముచేత నిన్ను గనినప్పుడె సుస్థిరమూలజీవులై
భక్తి ఫలించె నింద్రుని యుపాస్తిబలంబున ధన్యులైరినీ
భక్తులు కాళహస్తి భువనేశ్వర సాంబశివ మహాప్రభో !!
ల (0)
వ (7)
* వందితసన్ను తాంఘ్రి యొక భక్తుడు పుత్రునిజంపికూరగా
వండిభుజింప జేసెనుమఱియొక్క మహాత్ముడు నీకు భృత్యుడై
యుండికళత్రమిచ్చెననువొందగ జూచి మరొక్క భక్తుడున్
మెండుగ రాళ్ళురువ్వె పరమేశ్వర భక్తులజాడయెంతయు
ద్దండమొ కాళహస్తి యతివందిత సాంబశివా మహాప్రభో !!
* వరపురి కాళహస్తి విభవంబు చూడని కన్నులేల సు
స్థిరముగమిమ్ము నాత్మలొ వచించని పాపపు జిహ్వయేల యో
పురహర మిమ్ము పువ్వులను పూజలు చేయని చేతులేల స
ద్గురు కరుణాకటాక్షవీక్షణములు గోరని మానవజన్మ మేల యీ
ధరణిని కాళహస్తి మహారుద్రుడ సాంబశివా మహాప్రభో !!
* వరశివయాది బ్రహ్మవృషభధ్వజ మద్గురుషణ్ముఖాపితా
సురగురు వ్యోమకేశవరసుందర యీశ్వరయప్రమేయయో
కరివరదాసుతంఘ్రిశితి కంఠగిరీశ మహేశ్వరాజరా
సురహరఖడ్గపాణి జయశూలి భవాని శివపితామహా
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో !!
* వాదుకుబోకమాకు భగవంతుడెదిక్కుగదా యటంచు మీ
పాదమునమ్ముకొన్న శివభక్తుల కేమివ్రతంబులంచు నే
గాదనుటంచునోరు వడిగట్టుకయుండి నశించనేలయీ
భాదలు యేలవట్టి యుదకంబులుపిండి భుజింపనేల నా
వేదన కాళహస్తి నిటలాక్షుడ సాంబశివా మహాప్రభో !!
* వారధిగట్టవచ్చు భగవంతుని కన్నులజూడవచ్చు వ్యా
పారము సేయవచ్చు బడబాగ్ని కణంబుల మ్రింగవచ్చు నౌ
తారములెత్తవచ్చు యమదండన హింసకు తాళవచ్చు సం
సారముయీదరాదు హరిసాక్షిగ నాకొక త్రోవజూపవే
ధారుణి కాళహస్తి ధరణీశ్వర సాంబశివ మహాప్రభో !!
* వాసవపూజితంఘ్రముని వందిత దెవపరాకు యీశ్వరా
భాసురచిద్విలాస విరూపాక్షమృగాంక మృగాంక శోభితా
నాసుకయాది భక్తగణవత్సలచారుత్రిమూతిన్ మూలసిం
హాసనజ్యోతిరూపపరహంస నితాద్గురు దక్షిణాన కై
లాసము కాళహస్తి కరకంఠుడ సాంబశివా మహాప్రభో !!
* విపుల రధంబు హేమగిరి: విల్లు నుపేంద్రుడు; గాండమర్కౠ
క్షపతులు; బండికట్లు, విధి సారధి; శేషుడు నారి; వేదముల్
నృపుడు; గురాలు వేసికొని, నృత్యము ద్రొక్కుచుఁదోలినే
ద్రిపురనురారిఁ గూల్చితివి; ధీరత నెవ్వరు నీకుమించిరో ర్పుగాఁ
కృపగల కాళహస్తి ఘనకేశుఁడ సాంబశివా మహాప్రభో!
శ (3)
* శంకలుదీర్చి భక్తుల నిజంబుగ బ్రోతువటంచుబల్కితే
బొంకకు మాడితప్పకు మబద్ధములాడకు ముక్తిలేనిని
శ్శంకపరీత ఖండహర మాగత మొహరిబాయకుండుటల్
జంకుదువా శివార్చకులచెంతకు దూతల జేరనిత్తువా
శంకర కాళహస్తి నిటలాక్షుడ సాంబశివ మహాప్రభో !!
* శరణనినిన్ను వేడితిని చక్కని తండ్రి పతీతపావన
బిరుదులు గట్టినావుయట పేరు వహించి తరింపజేసినా
పరమ సుఖంబు భక్తిలకు పాపిట బొట్టుకిరీట రత్న మీ
పురమున సమస్త జీవులకు పుణ్యములిత్తువటంచు వస్తిమీ
మరుగుకు కాళహస్తి మహరుద్రుడ సాంబశివ మహాప్రభో !!
* శ్రీజలధౌత హైమతీచిత్తసుధారస పానదంష్ట్రయు
గ్రాజగవంధనుజ్వర హరానన హాసధరాధరార్చితా
రాజకిరీట పంచముఖరంజిత శుభ్రశరీరబంధురాం
భోజభనానుతాంఘ్రి ఫణిభూషణ చంద్రహుతాశనార్క గో
రాజిత కాళహస్తి మణిగోపుర సాంబశివా మహాప్రభో !!
ష (0)
స (1)
* స్థిరముగ నీదుదర్శనముఁ జేసినవాఁడె యనేకపాపముల్
పరిహరమాయెఁ గర్మములు పారఁదొలంగె; దరిద్ర దు:ఖముల్
దరికొని కాలసాగె; రజరాద్రి కనుంగొవఁ ద్రోవఁజిక్కె; నో
పరమశివుండ; మో క్షమను పర్వత మెక్కితి నయ్య; యో హరా
హరహర; కాళహస్తి హరివందిత; సాంబశివా మహాప్రభో!
హ (5)
* హరహర యిష్టలింగ సురహాస ముఖాబ్జనమోనమో పురం
దరనుత కాలకంధర కృతార్ధుల జేయుమటంచు నాత్మలో
సిరిగలవామదేవుని భజింపని పాపుపు దుష్టులైన యీ
నరులను ఘోరమయిన యమదండనబెట్టిరి చూడవయ్య యో
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివ మహాప్రభో !!
* హా పరమాత్మ! యంచుఁ జతురక్షరి ప్రాణప్రతిష్ఠమంత ని
క్షేపము మాకుకావలయుఁ కేవలమున్న సదాశివా! యనే
యాపద బాంధవుండ: త్రిపురాంతక: రుద్రుని నామకీర్తనల్
పాపవిమోచనంబు లని ప్రార్థన చేసెదఁ; బాదపద్మముల్
చూపుమి: కాళహస్తి సురసేవిత: సాంబశివా మహాప్రభో!
* హాసుర హాగజాసురుని హామిక నిల్వ ధరించలేక హా
నీసరి సాటి దేవతలు నిన్ను భజింపుచు వచ్చి మూతిపై
మీసము లేదుమాకు పరమేశ్వర మమ్ముల బ్రోవవయ్య మీ
దాసులమంచు మ్రొక్కిన ప్రతాపము చాలును మాకు శ్రీగిరీ
వాసుడ కాళహస్తి మహారుద్రుడ సాంబశివ మహాప్రభో !!
* హీనపు జాతి దుర్గుణుని కెన్నివిధంబుల బోధజేసినన్
వాని యసద్గుణంబులు నివారణ మొందునె? భోగివాసుకీ
కూనకు పాలు తేనె దధి గుజ్జు రసంబుల నెంతఁ బోసినన్
దాని విషంబు పోనె? మృతితప్పునె? క్రూరము మానునేకటా
మానదు కాళహస్తి బుధమాన్యుడ: సాంబశివా మహాప్రభో!
* హీనులు యెన్నివిద్యలు గ్రహించిన నప్పటి పొట్టకూటికే
కాని, తరింపు గద్ధ యధికారము నందును ముక్తియున్నదే?
వీనికి ముక్తికాంతస్థల మెక్కడిదో? యుని కేడనో మహా
జ్ఞానచరాచరంబులు మహాత్ముఁడ ని న్మది జాలనెప్పుడున్
గానరు: గాళహస్తి కరకంఠుఁడ సాంబశివా మహాప్రభో!
ళ (0)
క్ష (2)
* క్షమధర కౌస్తుభామణి సుగంధగజధ్వజ పారిభద్ర నా
గమునకు రక్షరేకు క్షమకాంతి శిరోమణి చుక్కబొట్టు వే
దములకు పట్టుకొమ్మ రిపుదానవ తస్కర రుద్రభూమి పా
పములకు హోమగుండము శుభాస్కర పాత్రులకన్న పుణ్యక్షే
మములకు కాళహస్తి పరమాత్ముడ సాంబశివ మహాప్రభో !!
* క్షితినునుత పద్మగంధముని సిద్ధ గణమ్ములు జన్మభూమి దే
వతలకు స్వర్గలోకమున నంభుది రాసులమీది మేదినీ
పతులకు పర్శ్వవేది శివభక్తి మహాత్ములనోరిగల్గనా
పతులకు గండ్రకత్తెర జపాంత కృతర్ధులఙ్ఞానభోధ స
న్నుతులకు కాళహస్తి పరమాత్ముడ సాంబశివ మహాప్రభో !!